Australian women cricketers: ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ కోసం భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను ఓ ఆకతాయి వేధింపులకు గురిచేశాడు. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సభ్యులు ఇద్దరూ గురువారం రోజు రాత్రి హోటల్ కి తిరిగి వస్తున్న సమయంలో ఇండోర్ లోని ఖజ్రానా రోడ్ వద్ద బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి వారి వెంటపడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. వారితో అశ్లీల చేష్టలు చేయడమే కాకుండా.. వారిని తాకేందుకు ప్రయత్నించాడు.
వారిలో ఒకరిని లైంగికంగా వేధించిన సంఘటన ప్రస్తుతం కలకలం సృష్టించింది. దీంతో వెంటనే సదరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు వారి జట్టు మేనేజర్ కి సమాచారం అందించారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు మేనేజర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ నేపథ్యంలో అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి వాంగ్మూలాలను నమోదు చేసుకొని.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఖాజ్రానాకు చెందిన 30 ఏళ్ల అకీల్ ని నిందితుడిగా గుర్తించి.. అతడిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. అయితే దేశంలో కీలకమైన ప్రపంచ కప్ టోర్నీ జరుగుతున్న సమయంలో.. విదేశీ మహిళా క్రికెటర్ల పట్ల ఇలాంటి దుస్థితి జరగడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్:
ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను వేధించిన నిందితుడు అకీల్ {నైట్రా} నేరచరిత్రను బయటపెట్టారు. పోలీసుల దర్యాప్తులో అకీల్ అలియాస్ నైట్రా అనే నిందితుడు సాధారణ వ్యక్తి కాదని.. అతడు ఇండోర్ కి చెందిన ఓ మోస్ట్ వాంటెడ్ రౌడీ అని తేలింది. పోలీసుల దర్యాప్తులో అతడు పదుల సంఖ్యలో తీవ్రమైన నేరాలకు పాల్పడ్డట్లు వెళ్లడైంది. అకీల్ నేర చరిత్రలో దారిదోపిడి, దొంగతనం, హత్యయత్నం, డ్రగ్స్, బెదిరింపులు, స్మగ్లింగ్, అక్రమ మద్యం వ్యాపారం వంటివి ఉన్నాయి. అతడు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో మోస్ట్ వాంటెడ్ నేరస్తుడిగా ఉన్నాడు. అంతేకాకుండా చాలాసార్లు అతడు జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసుల రికార్డులలో ఉంది.
పోలీసుల నిర్లక్ష్యమా..?
ఇటీవల బెయిల్ పై విడుదలైన అకీల్ వంటి నేరస్తుడి కార్యకలాపాలపై నిఘా ఉంచకపోవడం పెద్ద నిర్లక్ష్యమని మండిపడుతున్నారు క్రీడాభిమానులు. పోలీసులు అతనిపై నిఘా పెట్టి ఉంటే ఇలాంటి సంఘటన జరిగేది కాదని.. అతడి చర్య వల్ల అంతర్జాతీయ స్థాయిలో మన దేశ ప్రతిష్టకు భంగం కలిగిందని.. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నిందితుడి పై ఇప్పటికే పోలీసులు తమదైన శైలిలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి నడవలేకుండా చేసినట్లు పలు ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఘటనపై తాజాగా బీసీసీఐ స్పందించింది. క్రీడాకారుల భద్రతను పటిష్టం చేస్తామని.. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరక్కుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక అక్టోబర్ 30న జరగనున్న రెండవ సెమీ ఫైనల్ లో భారత్ – ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి.
He is Aqueel, the animal who moIested Australian women cricketers to bring shame to our country.
Another Abdul 🤡 pic.twitter.com/YsqBRFSfzB
— desi mojito (@desimojito) October 25, 2025