Jio Hotstar : ప్రతివారం సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. కేవలం థియేటర్లలో మాత్రమే కాదు.. అటు ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. కరోనా సమయంలో ఎన్నో ఓటిటి సంస్థలు పుట్టుకొని వచ్చాయి. అందులో ముఖ్యంగా వినిపించే పేరు జియో హాట్ స్టార్.. డిస్నీ హాట్ స్టార్ గా ఉన్న ఈ ప్లాట్ఫారం జియోతో టైఅప్ అయ్యింది. అయితే ఇప్పుడు కొత్త సినిమాలకు కొదవ లేకుండా చేస్తుంది. బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తూనే ఉంటాయి.కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు.. వేరే భాషల్లో సినిమాలను కూడా అందిస్తుంది. ఈ నెలలో బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. అందులో టాప్ ఫైవ్ వ్యూస్ ని అందుకున్న సినిమాలేంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ చిత్రం భద్రకాళి. థియేటర్లలో సక్సెస్ టాక్ ని అందుకున్న ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీలోకి అడుగు పెట్టింది.. అక్టోబర్ 24 నుంచి జియో హాట్‌స్టార్‌లో తెలుగులో భద్రకాళి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ స్టోరీతో వచ్చిన మూవీ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాని ఎక్కువగా వీక్షిస్తున్నారు. దాంతో ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే టాప్ 2 ప్లేస్ లోకి రావడం విశేషం..
తమిళ రొమాంటిక్ వెబ్ సిరీస్ హాట్ బీట్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. మొదటి సీజన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 ప్రస్తుతం ప్రసారమవుతుంది. ప్రతి వారం 4 ఎపిసోడ్స్ ని రిలీజ్ చేస్తుంటారు మేకర్స్..హాట్‌స్టార్‌లో టాప్ 3 స్థానంలో హార్ట్ బీట్ సీజన్ 2 ట్రెండింగ్‌లో ఉంది..
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ, మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం మిరాయ్.. థియేటర్లలో మంచి సక్సెస్ ని అందుకున్న ఈ సినిమా ఓటీటీలో కూడా దుమ్ము దులిపేస్తుంది. మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మిరాయ్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు టాప్ లోనే కొనసాగుతుంది. టాప్ 4 ఉంది.
కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో వెబ్ సిరీస్ పోలీస్ పోలీస్.. పోలీస్ స్టేషన్లో ఎలా ఉంటుంది. క్రిమినల్స్ ని ఎలా పట్టుకోవాలి అని కదా అంశంతో ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఉంటుంది. తమిళం తో పాటు తెలుగు, హిందీ, మలయాళం భాషలో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ వ్యూస్ దూసుకుపోతుంది. ప్రస్తుతం టాప్ ఫైవ్ లో ఇది ఉండడం విశేషం..
Also Read :బిగ్ బాస్ నుంచి పచ్చళ్ళ పాప అవుట్.. 2 వారాలకు రెమ్యూనరేషన్..?
ఇవే కాదు బిగ్ బాస్ టాప్ వన్ లో కొనసాగుతుంది. తెలుగు సీజన్ 9 ప్రస్తుతం ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ షో కి ప్రేక్షకుల ఆదరణ రోజురోజుకీ పెరుగుతుంది. దాంతో మంచి వ్యూస్ ని రాబడుతుంది. ఇలా మరికొన్ని షోలు వెబ్ సిరీస్ లు ఉన్నాయి. మీకు నచ్చిన సినిమాని లేదా వెబ్ సిరీస్ ని చూసి ఎంజాయ్ చేసేయండి..