E-Paper
Advertisement

Vivo V40: వి 40 సేల్ స్టార్ట్.. ఆఫర్లు ఇవే.. మొత్తం ఎన్ని వేరియంట్లు ఉన్నాయంటే?

Vivo V40: వి 40 సేల్ స్టార్ట్.. ఆఫర్లు ఇవే.. మొత్తం ఎన్ని వేరియంట్లు ఉన్నాయంటే?
Advertisement

Vivo V40 sale started in India: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు భారతదేశ ఫోన్ల మార్కెట్‌లో హవా చూపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల మరో చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో తన లైనప్‌లో ఉన్న VIVO V40 ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ సేల్స్ ప్రారంభమయ్యాయి. ఇది ZEISSతో టై-అప్‌లో కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. తద్వారా వినియోగదారులు ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోగ్రఫీని పొందగలుగుతారు. ఈ స్మార్ట్‌ఫోన్ దాని ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3ని కలిగి ఉంది. అలాగే ఇది మూడు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

అందులో ఈ స్మార్ట్‌ఫోన్ 8GB + 128 GB వేరియంట్ ధర రూ. 34,999గా ఉంది. అదే సమయంలో 8 GB + 256 GB వేరియంట్ రూ. 36,999, 12 GB + 512 GB వేరియంట్ రూ. 41,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ కలర్ వేరియంట్ల విషయానికొస్తే.. ఇది బ్లూ, పర్పుల్, టైటానియం గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ ఇ-స్టోర్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో సేల్‌కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ అందించబడుతుంది.

Advertisement

Also Read: ఐక్యూ నుంచి బ్లాక్ బస్టర్ ఫోన్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్.. కెమెరా, బ్యాటరీ అదరహో..!

కస్టమర్లకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఎంపిక కూడా ఉంది. ఇక దీని ఫీచర్ల విషయానికొసతే.. V40లో Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌గా ఇవ్వబడింది. ఇది 5,500 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని కెమెరా సిస్టమ్ సినిమాటిక్ పోర్ట్రెయిట్ వీడియో, ఫెస్టివల్ పోర్ట్రెయిట్ మోడ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇందులో AI ఎరేజర్, AI ఫోటో ఎన్‌హాన్సర్, AI సూపర్‌లింక్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో కెమెరా పనితీరు అప్‌డేట్ చేయబడింది. ఇకపోతే ప్రస్తుత సంవత్సరం ప్రారంభంలో ఈ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు ఏడాది ప్రాతిపదికన 7.2 శాతం పెరిగి దాదాపు 69 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి.

Advertisement

రెండవ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు దాదాపు 3.2 శాతం పెరిగి దాదాపు 35 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి.  ఇకపోతే ఈ మధ్య వివో కంపెనీ ఎక్కువగా బడ్జెట్ ధర సిగ్మెంట్‌లోనే ఫోన్లు లాంచ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. బడ్జెట్ విభాగంలో (ధర రూ. 8,400 నుండి రూ. 16,800 వరకు) స్మార్ట్‌ఫోన్‌ల షిప్‌మెంట్‌లు సంవత్సరానికి దాదాపు 8 శాతం పెరిగాయి. Xiaomi కూడా ఈ విభాగంలో కూడా ముందంజలో ఉంది.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×