BigTV English
Advertisement

British billionaire MikeLynch: సముద్రంలో మునిగిన షిప్.. బ్రిటన్ వ్యాపారవేత్త మైక్ లించ్ గల్లంతు..

British billionaire  MikeLynch: సముద్రంలో మునిగిన షిప్.. బ్రిటన్ వ్యాపారవేత్త మైక్ లించ్ గల్లంతు..

British billionaire MikeLynch: బ్రిటీష్‌కు చెందిన బిజినెస్‌మేన్ మైక్ లించ్ సిసిలీ తీరంలో గల్లంతు అయ్యారు. తీవ్రమైన తుఫాను కారణంగా ఆయన ప్రయాణించిన చిన్నపాటి నౌక సముద్రంలో మునిగిపోయింది. ఆయనతోపాటు ఏడుగురు గల్లంతు అయినట్టు సమాచారం.


అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం.. ఇటలీలోని సిసిలీ పోర్టు నుంచి ఆగష్టు 14న చిన్నపాటి నౌక్(యాట్) బయలుదేరింది. మొత్తం 22 మంది సభ్యులతో  జర్నీ మొదలైంది. అందులో 10 మంది సిబ్బంది కాగా, మరో డజను మంది ప్యాసింజర్లు ఉన్నారు. అందులో బ్రిటీష్ బిలియనీర్ టెక్ గెయిట్ మైక్ లించ్ కూడా ఉన్నారు.

పోర్టిసెల్లో తీరానికి సమీపంలో ప్రతికూల వాతావరణం కారణంగా మైక్ లింగ్ ప్రయాణిస్తున్న షిప్ మునిగిపోయినట్టు తెలుస్తోంది. గల్లంతు అయినవారిలో నలుగురు బ్రిటీషర్లు, ఇద్దరు అమెరికన్లు, ఒకరు కెనడియన్ ఉన్నట్లు ఇటలీ అధికారులు చెబుతున్నారు.


ALSO READ: 13 ఏళ్లుగా భార్య కోసం గాలింపు.. అతడి ఎదురుచూపు వెనుక అంతుచిక్కని విషాదం

ఈ ప్రమాదంలో మైక్ లించ్ వైఫ్‌తోపాటు మరో 14 మంది బయటపడ్డారు. మరో ఎనిమిది మంది గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్య్కూ టీమ్స్ రంగంలోకి దిగి, షిప్ మునిగిపోయిన ప్రాంతాన్ని గాలింపు చేపట్టారు. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ఒకరి మృతదేహాన్ని కనుగొన్నారు.  మునిగిపోయిన నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గల్లంతైన వారిలో 59 ఏళ్ల బ్రిటీష్ బిజినెస్‌మేన్ మైక్ లించ్ ఉన్నారు. ఇటీవల అమెరికాలోని ఓ కేసులో నిర్ధేషిగా ఆయన బయటపడ్డారు. టెక్ దిగ్గజం అయిన మైక్ లించ్.. 1990ల్లో అనాటమీ కార్పొరేషన్‌ను ప్రారంభించిన విషయం తెల్సిందే.

 

 

Related News

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

Big Stories

×