BigTV English
Advertisement

Vivo Y28s 5G Sale: ఊచకోతే.. వివో మిడ్ రేంజ్ ఫోన్.. డబ్బులు దాచుకో మావ!

Vivo Y28s 5G Sale: ఊచకోతే.. వివో మిడ్ రేంజ్ ఫోన్.. డబ్బులు దాచుకో మావ!

Vivo Y28s Sale on July 3rd: Vivo బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ దేశీయ మార్కెట్‌లో సందడి చేస్తోంది. Vivo Y28s స్మార్ట్‌ఫోన్ గత వారం Vivo తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేసింది. తాజాగా ఈ ఫోన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్‌లో సేల్‌కు తీసుకొచ్చారు. ఫోన్ చూడటానికి చాలా అట్రాక్టెడ్ లుక్‌తో కనిపిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.14,000 కంటే తక్కువగా ఉంటుంది. ఫోన్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.


Vivo Y28s Features
Vivo Y28s 5G 6.5-అంగుళాల LCD డిస్‌ప్లేతో వాటర్‌డ్రాప్ నాచ్, మందపాటి బాటమ్ చిన్, HD ప్లస్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంటుంది. దీని పవర్ బటన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌గా కూడా పనిచేస్తుంది. వెనుక భాగంలో ఇది రెక్టాంగిల్ వెనుక కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఫోన్ IP64 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది.

Also Read: Moto G85: కొత్త ఆటగాడు రెడీ.. కర్వ్డ్ pOLED డిస్‌ప్లే, స్నాపడ్రాగన్ ప్రాసెసర్‌తో మోటో కొత్త ఫోన్.. ఇంత తక్కువ ధరలోనా..?


ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. కెమెరా సెటప్ ఫోన్ 50-మెగాపిక్సెల్ మెయిన్ రియర్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్‌తో డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. కెమెరా ఫీచర్లలో నైట్ మోడ్, బిల్ట్-ఇన్ ఫిల్టర్‌లు ఉన్నాయి.

ఈ ఫోన్‌లో MediaTek Dimension 6300 ప్రాసెసర్ ఉంటుంది. స్టోరేజ్ ప్రకారం మూడు వేరియంట్‌లలో విడుదలైంది. ఇందులో 4GB RAM, 6GB RAM, 8GB RAM+ 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో SD కార్డ్‌తో స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు. ఫోన్ 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. కొన్ని మార్కెట్లలో (యూరోప్, మలేషియా, తైవాన్, థాయ్‌లాండ్), ఫోన్ బండిల్ ఛార్జర్‌తో రాదు. ఇది Android 14లో Funtouch OS 14 పై రన్ అవుతుంది. ఫోన్‌లో అందుబాటులో ఉన్న కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్, 5G, USB-C పోర్ట్ మరియు 3.5mm జాక్ ఉన్నాయి.

Also Read: OnePlus Nord 4: అదరగొట్టావ్.. వన్‌ప్లస్ కొత్త ఫోన్.. కెవ్ అనిపిస్తున్న కెమెరా డిజైన్!

Vivo దేశీయ మార్కెట్‌లో ఆఫ్‌లైన్‌లో మూడు కాన్ఫిగరేషన్‌లలో Y28s 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.  4GB + 128GB వేరియంట్ ధర రూ.13,999, 6GB + 128GB వేరియంట్ ధర రూ.15,499, 8GB + 128GB వేరియంట్ ధర రూ.16,999. 8GB + 128GB మోడల్ కొన్ని వారాల తర్వాత స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ను బ్రౌన్, పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Related News

Fake Calls SMS: సైబర్ మోసగాళ్లకు చెక్.. ఫేక్ కాల్స్, SMSలను ఇలా గుర్తించండి

Vivo X300: బెస్ట్ ఫొటోగ్రఫీ ఫోన్ వచ్చేసింది.. ప్రీమియం డిస్‌ప్లే, 200MP కెమెరాలతో వివో X300 ప్రో లాంచ్

Most Secure Smartphones: ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?

Samsung W26 Foldable: ఫోల్డెబుల్ ఫోన్‌లో 200MP కెమెరా, శాటిలైట్ కనెక్టివిటీ… శామ్‌సంగ్ W26 ఫోల్డ్ లాంచ్

Storing Paswords: బ్రౌజర్‌లో పాస్‌వర్డ్‌లు సేవ్ చేస్తున్నారా? ఈ ప్రమాదాల గురించి తెలుసుకోండి

Amazon Alexa Offers: అలెక్సా డివైజ్‌లపై 50 శాతం తగ్గింపు.. లిమిటెడ్ ఆఫర్ త్వరపడండి

Motorola Moto G85 5G: ఒక్క ఫోన్‌లో అన్ని ఫీచర్లు.. 7800mAh బ్యాటరీతో మోటోరోలా G85 5G పోన్ లాంచ్

Smartphone Comparison: మోటో G06 పవర్ vs గెలాక్సీ M07.. ₹8,000 కంటే తక్కువ ధరలో ఏది బెస్ట్?

Big Stories

×