Moto G06 Power vs Galaxy M07| మోటోరోలా ఇండియాలో కొత్త మోటో G06 పవర్ ఫోన్ ఇటీవలే లాంచ్ చేసింది. ఇది శామ్‌సంగ్ గెలాక్సీ M07కు నేరుగా పోటీపడుతుంది. రెండు ఫోన్‌లు ధరలో సమానంగా ఉన్నాయి మరియు బడ్జెట్ కొనుగోలుదారులకు లక్ష్యంగా ఉన్నాయి. ఈ పోలికలో రెండు ఫోన్‌ల ముఖ్య ఫీచర్లు, పనితీరు గురించి పోల్చి చూద్దాం. రెండింటిలో ఏది కొనుగోలు చేయాలో
మోటో జి06 పవర్ ధర ₹7,499. ఇది 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం07 ధర ₹6,999 నుంచి ₹7,699 మధ్య ఉంటుంది. రెండూ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌తో వస్తాయి. మోటో కొంచెం తక్కువ ధరతో మంచి విలువను అందిస్తుంది. రెండూ ₹8,000 కంటే తక్కువ ధరలోనే లభిస్తాయి.
మోటో G06 పవర్‌లో 6.88-ఇంచ్ హెచ్‌డి+ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్ చాలా సులభంంగా ఉంటుంది.. అలాగే 600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. ఇది కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 3తో రక్షించబడి ఉంటుంది. గెలాక్సీ M07లో 6.7-ఇంచ్ పీఎల్‌ఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంది. మోటో డిస్‌ప్లే పెద్దది, మెరుగైనది, వీడియోలు, గేమ్‌లకు బాగా ఉపయోగపడుతుంది.
మోటో G06 పవర్ మీడియాటెక్ హెలియో జి81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రోజువారీ పనులు, లైట్ గేమింగ్‌కు మంచిది. గెలాక్సీ M07లో మీడియాటెక్ హెలియో G99 చిప్ ఉంది. మోటో కంటే గేమింగ్‌లో గెలాక్సీ కొంచెం బెటర్. రెండూ 4జీబీ ర్యామ్‌తో మల్టీటాస్కింగ్‌కు తదుపరి పనిచేస్తాయి. పనితీరులో శామ్‌సంగ్ కాస్త ముందంజలో ఉంది.
రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15తో వస్తాయి. మోటోలో హెలో యూఆర్ఐ (మై యూఎక్స్) సాఫ్ట్‌వేర్ స్మూత్‌గా ఉంటుంది. శామ్‌సం M07లో వన్ యూఆర్ఐ 7.0 ఇంటర్‌ఫేస్ ఎక్కువ ఫీచర్లతో వస్తుంది. శామ్‌సంగ్ 6 సంవత్సరాల ఆప్‌డేట్‌లు అందిస్తుంది, మోటో కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది. M07 సాఫ్ట్‌వేర్ అధికంగా కస్టమైజ్ చేయవచ్చు.
రెండూ 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తాయి. మోటోలో మైక్రోఎస్‌డి కార్డ్‌తో 1టీబీ వరకు విస్తరించవచ్చు. M07లో 2టీబీ వరకు విస్తరణ ఉంది. రెండూ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఉన్నాయి. M07 స్టోరేజ్ విస్తరణలో బెటర్.
మోటో G06 పవర్‌లో 50ఎంపీ మెయిన్ రెర్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. లోలైట్‌లో షార్ప్ ఫోటోలు తీసుకోవచ్చు. ఎం07లో 50ఎంపీ మెయిన్ + 2ఎంపీ డెప్త్ సెన్సార్ డ్యూయల్ రెర్ సెటప్, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా. పోర్ట్రెయిట్ మోడ్‌లో మెరుగ్గా పనిచేస్తుంది. రెండూ మంచి సెల్ఫీలు తీస్తాయి, కానీ ఎం07 డెప్త్ సెన్సార్‌తో ఎక్స్‌ట్రా.
మోటో G06 పవర్‌లో 7000mAh బ్యాటరీ, 18డబ్ల్యూ వైర్డ్ చార్జింగ్ ఉంది. 65 గంటల వరకు ఉపయోగం చేయవచ్చు. M07లో 5000mAh బ్యాటరీ, 25డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్. మోటో బ్యాటరీ లైఫ్‌లో గెలుస్తుంది, కానీ M07చార్జింగ్ స్పీడ్ గా చేస్తుంది.
పెద్ద బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే మీకు కావాలంటే మోటో G06 పవర్ ఎంచుకోండి. ఇది రోజంతా ఉపయోగానికి బాగా ఉంటుంది. పనితీరు, ఫాస్ట్ చార్జింగ్, మెరుగైన సాఫ్ట్‌వేర్ కావాలంటే గెలాక్సీ M07 మంచిది. మీ అవసరాల ప్రకారం ఎంచుకోండి. రెండూ IP54/64 రేటింగ్‌తో దుమ్ము, నీటితో ప్రొటెక్షన్ ఫీచర్ కలిగి ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో స్వల్ప తేడాలతో రెండూ మంచి ఆప్షన్లు.
Also Read: శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌తో డేంజర్.. వాచిపోయిన వేలితో ఆస్పత్రిపాలైన యూజర్