BigTV English

Nivetha Pethuraj: నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు.. మరో అమ్మాయితో..

Nivetha Pethuraj: నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు.. మరో అమ్మాయితో..

Nivetha Pethuraj latest news(Tollywood news in telugu): తమిళ్ బ్యూటీ నివేతా పేతురాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీవిష్ణు హీరోగా నటించిన మెంటల్ మదిలో అనే సినిమా ద్వారా తెలుగు కు పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత నివేతా మంచి అవకాశాలనే అందుకుంది.


టిక్ టిక్ టిక్, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురంల, పాగల్, దాస్ కా ధమ్కీ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక అవకాశాలను అయితే అందుకుంటుంది కానీ, అమ్మడు స్టార్ గా మారలేకపోయింది. దానికోసం బాగానే కష్టపడుతుంది. ఇక ఈ మధ్యనే నివేతా.. పరువు అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. జీ5 లో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది. తనకు ఎక్కువగా నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ అని, అవన్నీ కూడా నిజం అవుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పుకొచ్చింది.


” నేను రిలేషన్ లో ఉన్నప్పుడు నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేస్తాడని అనుకున్నాను. ఆ ఆలోచనతోనే ఉన్నాను. చివరికి అదే నిజం అయ్యింది. నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు. నేను ఉండగానే మరో అమ్మాయితో పారిపోయాడు. ఇదొక్కటే కాదు.. నేను ఇప్పుడు కొన్నకారు నుంచి.. భవిష్యత్తులో కొత్త కారు కొనేదానివరకు నెగెటివ్ ఆలోచనలే చేస్తాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నివేతా వ్యాఖ్యలు విన్న అభిమానులు.. అలాంటి ఆలోచనలు మంచివి కాదని సలహాలు ఇస్తున్నారు.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×