Robbery: హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లోని దండమూడి కాలనీలో దొంగలు హల్‌చల్ సృష్టించారు. వేటకొడవళ్లు, కట్టర్లు, ఇనుప రాడ్లు, మారణాయుధాలతో దొంగతనాలకు పాల్పడ్డారు ముగ్గురు దుండగులు. రెండు గంటల వ్యవధిలోనే ఐదు ఇళ్లలో చోరీకి తెగబడ్డారు. దొంగతనం చేసే సమయంలో ఓ ఇంట్లో అమర్చిన అలారం మోగడంతో దొంగలు పరారయ్యారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సీసీటీవీ పరిశీలించారు. ఆపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.