Samsung W26 Foldable| శామ్‌సంగ్ కొత్తగా W26 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను చైనాలో మాత్రమే లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రీమియం గెలాక్సీ Z ఫోల్డ్ సిరీస్‌లో భాగం. ఈ ఫోన్ గెలాక్సీ Z ఫోల్డ్ 7తో సమానమైన ఫీచర్లు కలిగి ఉంది. పవర్ ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో ఇది పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో అధిక మెమరీ, శాటిలైట్ కనెక్టివిటీతో ఫీచర్లు ఉండడం ప్రత్యేకం.
W26 ఫొల్డెబుల్ ఫోన్‌లో 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర CNY 16,999. అంటే భారత కరెన్సీలో సుమారు ₹2,11,200. 16జీబీ ర్యామ్, 1టీబీ వేరియంట్ ధర CNY 18,999, అంటే సుమారు ₹2,36,000. ఇది డ్యూయల్ కలర్ వేరియంట్స్.. రెడ్ & గోల్డ్, బ్లాక్ & గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. చైనాలో శామ్‌సంగ్ వెబ్‌సైట్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్‌లో 8-ఇంచ్ ఇన్నర్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది QXGA+ రిజల్యూషన్‌తో స్పష్టమైన ఫొటోలను ఇస్తుంది. కవర్ డిస్‌ప్లే 6.5-ఇంచ్ ఫుల్ HD+ ప్యానెల్‌తో వస్తుంది. రెండు స్క్రీన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నాయి. గరిష్ఠ బ్రైట్‌నెస్ 2,600 నిట్స్ వరకు ఉంటుంది. ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
అత్యంత అడ్వాన్స్ చిప్ అయిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఈ ఫోన్‌కు శక్తినిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16తో వన్ యూఐ 8పై రన్ అవుతుంది. గెలాక్సీ AI ఫీచర్లు.. స్మార్ట్ పాస్‌వర్డ్ మేనేజర్‌తో సౌలభ్యం అందిస్తాయి Z ఫోల్డ్ 7 కంటే ఎక్కువ మెమరీ ఈ ఫోన్‌లో ఉంది, మల్టీటాస్కింగ్‌కు అనువైనది.
W26లో 200MP ప్రైమరీ కెమెరా ఉంది. ఈ కెమెరాతో అద్భుతమైన ఫోటోలను తీయగలం. 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్ వైడ్ యాంగిల్ షాట్స్ తీయవచ్చు. 10MP టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్‌ను ఇస్తుంది. ఇన్నర్ ఫోల్డబుల్ ప్యానెల్‌లో 10MP సెల్ఫీ కెమెరా ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీలకు ఉపయోగపడుతుంది.
చైనా, టియాంటాంగ్ శాటిలైట్ సిస్టమ్‌తో డైరెక్ట్ శాటిలైట్ కనెక్టివిటీని ఈ కొత్త ఫోల్డెబుల్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. మొబైల్ నెట్‌వర్క్ లేనప్పుడు ఎమర్జెన్సీ కాల్స్, మెసేజ్‌లు పంపవచ్చు. 5G, వై-ఫై, బ్లూటూత్, GPS, USB టైప్-C కనెక్టివిటీ ఆప్షన్‌లు ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సెక్యూరిటీని అందిస్తుంది.
ఈ ఫోన్ లో 4,400mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 25W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అన్‌ఫోల్డ్ ఫోన్ కొలతలు.. 158.4 × 143.2 × 4.2 mm అలాగే ఫోల్డ్ చేసినప్పుడు 158.4 × 72.8 × 8.9 mmగా ఉంటుంది. దీని డిజైన్ స్లీక్, ప్రీమియం లుక్ తో ఉంటుంది.
అత్యంత అడ్వాన్స్ చిప్ టెక్నాలజీ, అడ్వాన్స్ ఆండ్రాయిడ్ 16, 200MP కెమెరా, శాటిలైట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లతో విడుదలైన ఈ సూపర్ ఫొల్డెబుల్ ఫోన్ ధర ధర ₹2.11 లక్షల నుండి మొదలవుతుంది. ఈ ఫోన్ టెక్ ఔత్సాహికులకు, ప్రొఫెషనల్స్‌కు అనువైనది. దీని శాటిలైట్ ఫీచర్ ఎమర్జెన్సీ సమయంలో సహాయపడుతుంది.
Also Read: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే