Vivo X300| ఇప్పటివరకు బెస్ట్ కెమెరా ఫోన్‌గా వివో X200 ప్రో నిలిచింది. అయితే వివో ఈ ఫోన్ ని మించే టెక్నాలజీతో కొత్త మోడల్ లాంచ్ చేసింది. అత్యంత పవర్‌ఫుల్ X300 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను చైనాలో లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో వివో X300, వివో X300 ప్రో మోడల్స్ ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ వస్తున్నాయి. అవి Android 16 ఒరిజిన్ OS 6 పై నడుస్తాయి. ఇవి జెయిస్ ట్యూన్డ్ కెమెరాలు V3+ ఇమేజింగ్ చిప్స్ కలిగి ఉన్నాయి.
వివో X300 12GB+256GB వేరియంట్ ధరకు CNY 4,399 (సుమారు ₹54,700) కు ప్రారంభమవుతుంది. 16GB+1TB టాప్ మోడల్ ధర CNY 5,799 (అంటే భారత కరెన్సీలో సుమారు ₹72,900). ఇది ఫ్రీ బ్లూ, కంఫర్టబుల్ పర్పుల్, ప్యూర్ బ్లాక్ లక్కీ రంగుల్లో లభిస్తుంది.
వివో X300 ప్రో 12GB+256GB బేస్ మోడల్ కి CNY 5,299 (సుమారు ₹65,900) కు ప్రారంభమవుతుంది. 16GB+1TB వేరియంట్ ధర CNY 6,699 (సుమారు ₹83,300). శాటిలైట్ కమ్యూనికేషన్ ఎడిషన్ ధర CNY 8,299 (సుమారు ₹1,03,200). ఇది వైల్డర్నెస్ బ్రౌన్, సింపుల్ వైట్, ఫ్రీ బ్లూ, ప్యూర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
వివో X300 ప్రో లో 6.78-ఇంచ్ 1.5K OLED LTPO ఫ్లాట్ డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేస్తుంది. ఈ ప్యానెల్ సర్క్యులర్ పోలరైజేషన్ 2.0 ను కలిగి ఉంది. ఇది బయట ఎండలో కూడా స్క్రీన్ వ్యూ బ్రైటెనెస్ ఇస్తుంది.
స్టాండర్డ్ వివో X300 లో 6.31-ఇంచ్ OLED LTPO డిస్ప్లే ఉంది. ఇది కూడా 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. రెండు మోడల్లలో ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, స్లిమ్ బాడీ, IP68 వాటర్ డస్ట్ రెసిస్టెన్స్ ఉంటాయి.
వివో X300 ప్రో లో 50MP సోనీ LYT-828 మెయిన్ కెమెరా (OIS తో) ఉంటుంది. ఇందులో 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. ఇది జీస్ 2.35× టెలిఫోటో టెలికన్వర్టర్ యాక్సెసరీలను సపోర్ట్ చేస్తుంది.
వివో X300 లో 200MP శాంసంగ్ HPB ప్రాధమిక సెన్సర్ (OIS తో) ఉంటుంది. ఇందులో 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. రెండు ఫోన్లలో 50MP ఫ్రంట్ కెమెరా ఉండి, షార్ప్ సెల్ఫీలను తీస్తుంది.
జీస్-ట్యూన్డ్ సిస్టమ్ V3+, VS1 ఇమేజింగ్ చిప్స్ తో పనిచేస్తుంది. ఇది అద్భుతమైన ఇమేజ్ ప్రాసెసింగ్ ను అందిస్తుంది.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్ ఆధారంగా అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయి. అవి LPDDR5x RAM, UFS 4.1 స్టోరేజ్ తో జతచేయబడతాయి. అవి Android 16 పై ఆధారితమైన ఒరిజిన్ OS 6 పై నడుస్తాయి.
వివో X300 ప్రో లో 6510mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 90W వైర్డ్, 40W వైర్లెస్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. X300 లో 6040mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ కూడా అదే ఫాస్ట్-ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది.
అదనపు లక్షణాలలో అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, డ్యువల్ స్పీకర్లు, X-అక్షం లీనియర్ మోటార్, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, GPS, USB 3.2 టైప్-C పోర్ట్ ఉన్నాయి.
వివో X300 సిరీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు ఒక బలమైన ప్రవేశం. DSLR-లెవల్ కెమెరా పనితీరు, అత్యుత్తమ డిస్ప్లే, ఫ్లాగ్షిప్-లెవల్ పనితీరు ఈ ఫోన్ల ప్రత్యేకత. ఇవి ప్రస్తుతం చైనాలో మాత్రమే లభిస్తున్నాయి. భారత్ లో కూడా త్వరలోనే లాంచ్ కాబోతున్నాయి.
Also Read: శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌తో డేంజర్.. వాచిపోయిన వేలితో ఆస్పత్రిపాలైన యూజర్