BigTV English

OnePlus Nord 4 Release: అదరగొట్టావ్.. వన్‌ప్లస్ కొత్త ఫోన్.. కెవ్ అనిపిస్తున్న కెమెరా డిజైన్!

OnePlus Nord 4 Release: అదరగొట్టావ్.. వన్‌ప్లస్ కొత్త ఫోన్.. కెవ్ అనిపిస్తున్న కెమెరా డిజైన్!

OnePlus Nord 4 Releasing on July 16: వన్‌ప్లస్ నార్ట్ 4 స్మార్ట్‌ఫోన్ జూలై 16న విడుదల కానుంది. లాంచ్ చేయడానికి ముందు ఫోన్ అధికారిక పోస్టర్ విడుదల చేసింది. దీనిలో ఫోన్ చాలా మంచి లుక్ కనిపిస్తుంది. అలానే దాని అన్ని కలర్ వేరియంట్లు వెల్లడయ్యాయి. బయటకు విడుదలైన ఫోటోలను చూస్తుంటే ఫోన్ లాంచ్ అయిన వెంటనే మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తుందని తెలుస్తోంది. చూసిన వెంటనే ప్రజలు దీనికి ఫాదా అయిపోతారని చెప్పవచ్చు. ఇటీవల OnePlus Nord 4 లీకైన స్కీమాటిక్ డిజైన్ వెల్లడైంది. ఇప్పుడు ఫోన్ అధికారిక పోస్టర్ టీజ్ అయింది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.


వన్‌ప్లస్ నార్ట్ 4 అధికారిక పోస్టర్‌ను OnePlus క్లబ్ Nord 4 స్మార్ట్‌ఫోన్ పోస్టర్‌ను X లో షేర్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. అలర్ట్ స్లయిడర్ ఎడమ వైపున ఉన్నప్పుడు వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ కుడి వైపున ఉంటాయి. వెనుక ప్యానెల్ గురించి మాట్లాడితే OnePlus గత సంవత్సరం Nord 3లో వర్టికల్ కెమెరా సెటప్‌ను తీసుకొచ్చింది.

OnePlus Nord 4 డ్యూయల్-టోన్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంటుందని చిత్రాలలో చూడవచ్చు. కెమెరా సెన్సార్ క్రింద భాగం గ్లాసీ ఫినిషింగ్‌తో వస్తుంది. మిగిలిన ప్యానెల్ మెటల్ ఫినిషింగ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. డిజైన్ పిక్సెల్స్ చూసినట్లయితే మొదటి జనరేషన్‌ ఫోన్లను చూసినట్లుగా ఉంటుంది.


Also Read: జేబులో డాక్టర్ ఉన్నట్లే.. తల్లిదండ్రులకు పర్ఫెక్ట్ ఫోన్లు.. ఇదేదో భలేగా ఉందే!

ఈ స్మార్ట్‌ఫోన్ గ్రీన్, సిల్వర్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. సిల్వర్ వేరియంట్‌లో చాలా షైనీగా ఉంటుంది. ఫోన్ మెటల్ యూనిబాడీని కలిగి ఉంటుందని బ్రాండ్ ఇప్పటికే సూచించింది. నార్ట్ 4 ముందు ఇది చాలా సన్నని బెజెల్స్‌తో రౌండ్ షేప్ సెంటర్-అలైన్డ్ పంచ్-హోల్ కటౌట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లలో టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. వన్‌ప్లస్ నార్డ్ 3కి సక్సెసర్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల OLED Tianma U8+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే 2150 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లో Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్‌ ఉంది. 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

Also Read: ఏమి తేజస్సు.. షియోమీ నుంచి కిరాక్ ఫోన్.. ఇక వాటికి చుక్కలే!

స్మార్ట్‌ఫోన్‌లో 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500 mAh బ్యాటరీ ఉంటుంది. కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, IR బ్లాస్టర్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సోనీ IMX355 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది.

Tags

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×