Gambhir-Harshit Rana: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ అక్టోబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియాను ప్రకటించారు. ఇందులో హర్షిత్ రాణా పేరు ఉండడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్ లోను హర్షిత్ రాణాను గౌతమ్ గంభీర్ ఆడిస్తున్నాడని సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టారు. దారుణంగా ట్రోలింగ్ చేశారు. అయితే ఈ ట్రోల్లింగ్స్ పై తాజాగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. హర్షిత్ రాణా చాలా టాలెంటెడ్ ప్లేయర్ అని, నిరుపేద కుటుంబం కాబట్టి సెలెక్ట్ అయినట్లు వెల్లడించారు. నా కొడుకు హర్షిత్ రాణా అంటూ కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు… అలాంటి వాళ్లు ఇకపై అన్ని మానుకోవాలని ఫైర్ అయ్యారు. దీంతో గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read: Smriti Mandhana: గిల్ ఓ పిల్లబచ్చా…స్మృతి మందాన కండలు చూడండి…పిసికి చంపేయడం ఖాయం !
టీమిండియా (Team India) ఏ ఫార్మాట్ ఆడినా ఖచ్చితంగా హర్షిత్ రాణా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ అంశం బాగా వైరల్ గా మారింది. హర్షిత్ రాణాను ( Gambhir-Harshit Rana ) పదేపదే గౌతమ్ గంభీర్ సెలెక్ట్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా చేశారు. మహమ్మద్ షమీ అలాగే మహమ్మద్ సిరాజ్ లాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా హర్షిత్ రాణాకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారని మండిపడ్డారు అభిమానులు. అయితే ఈ ట్రోలింగ్స్ పై తాజాగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. కొన్ని యూట్యూబ్ ఛానల్ వ్యూవర్ షిప్ కోసం 23 సంవత్సరాల హర్షిత్ రాణాను టార్గెట్ చేశారని ఫైర్ అయ్యారు. వాళ్ల బతుకుదెరువు కోసం హర్షిత్ రాణాను టార్గెట్ చేసి, ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు.
హర్షిత్ రాణా తండ్రి మాజీ చైర్మనో లేక మాజీ క్రికెటరో లేదా బిజినెస్ మాన్ కొడుకో కాదు … సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాడే హర్షిత్ రాణా అని తెలిపారు. ఇప్పటివరకు కష్టపడి ఆడిన హర్షిత్ రాణాను టార్గెట్ చేయకండి అని కోరారు. ఫ్యూచర్ లో మీ పిల్లల్ని కూడా ఎవరో ఒకరు టార్గెట్ చేయవచ్చు అంటూ వార్నింగ్ ఇచ్చారు. కాస్త జాగ్రత్తగా ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు గౌతమ్ గంభీర్. కొంతమంది పెద్ద కొడుకు అంటూ ప్రచారం చేస్తున్నారని నిప్పులు జరిగారు. సెలెక్ట్ చేస్తే అతడు నా కొడుకు అయిపోతాడా ? అని కౌంటర్ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా ప్రతి మ్యాచ్ లోను హర్షిత్ రాణా జట్టులో ఉంటున్న నేపథ్యంలో గంభీర్ పెద్ద కొడుకు అంటూ వ్యంగ్యంగా ట్రోలింగ్ చేశారు అభిమానులు. అందుకే గౌతమ్ గంభీర్ స్పందించారు.
“It’s shameful. I’ll be very honest. Aap apna youtube channel chalane ke liye 23 saal ke bache ho nahi chor rahe. Vo apne dum pe cricket khela hai aur aage bhi khelega. Aap logo ki performance pe target kar sakte hai. Aap 23 saal ke bache ko itna sab kuch bolte hai aur vo itna… pic.twitter.com/M39lyB6zO6
— Kanav Bali (@Concussion__Sub) October 14, 2025