Vreels App: ఒకప్పుడు మన దేశంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన యాప్ ఏదైనా ఉందంటే.. అది టిక్‌టాక్ మాత్రమే. వాట్సప్ ఎలా అయితే.. ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఉండేదో, అలా టిక్‌టాక్ యాప్ కూడా తప్పకుండా ఉండేది. అయితే, భారత్‌లో టిక్‌టాక్ బ్యాన్ చేసిన తర్వాత అత్యధిక మంది ఇన్‌స్టాగ్రామ్‌ను వినియోగిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఈ రెండు యాప్స్‌కు గట్టిపోటీ ఇచ్చేలా వచ్చిందే ‘వీరీల్స్’ అనే సరికొత్త యాప్.
ఈ ప్రపంచానికి కొత్త తరహా డిజిటల్ అనుభవాన్ని అందించడానికి వచ్చిందే ఈ సరికొత్త యాప్. Vreels అంటే.. ‘Virtually Relax, Explore, Engage, Live & Share’ అని అర్థం. అమెరికాలో నివసించే మన తెలుగు ఇంజనీర్లే ఈ యాప్‌ను సృష్టించారు. ఇప్పటికే 22 దేశాల్లో విడుదలైన ఈ వీరీల్స్ బీటా దశలో ఉంది.
ఈ సృజనాత్మకత ప్రపంచానికి అన్నీ ఒకేచోట లభించాలనే ఉద్దేశంతో ఈ యాప్‌ను తీసుకొచ్చారు. ఈ Vreels ఒకేచోట కంటెంట్ సృష్టి, వినోదం, సంభాషణకు డిజిటల్ వేదికగా మారింది. దీనిలో ప్రతి వినియోగదారుడు ఓ క్రియేటర్‌గా మారవచ్చు. చిన్న చిన్న వీడియోలు, ఫొటోలు, క్రియేటివ్ స్టోరీలను వ్యక్తిగతంగా యూజర్ల ఆసక్తులకు సరిపోయేలా రూపొందించవచ్చు. దీనిలో ఫీడ్ యూజర్లు ఇష్టపడే విషయాలను నేర్చుకుంటూ.. మరింత పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.
* Vreels యాప్‌లో మీ భావాలు, ప్రయాణాలు, ఆలోచనలు.. అన్నీ ఒక్క క్లిక్‌తో రికార్డ్ చేసి, ఎడిట్ చేసి ఇతరులతో పంచుకోవచ్చు. వీడియోలు, ఫొటోల రూపంలో ఆకస్తికరంగా యూజర్లు తమ భావాలను వ్యక్తీకరించుకోవచ్చు. ఫిల్టర్లు, టెక్ట్స్, స్టిక్కర్లు, మ్యూజిక్ సహాయంతో వీరీల్స్ క్రియేటర్లకు మెరుగైన అనుభవం ఇస్తుంది.
* ఈ యాప్‌లో Pix Pouches అనే డిజిటల్ నోట్‌బుక్ ప్రత్యేకం. మీకు ఇష్టమైన ఫొటోలు లేదా ఆలోచనలను వర్గాల వారీగా స్టోర్ చేసుకోవచ్చు. స్నేహితులతో కలిసి కలెక్షన్లు సృష్టించి, మంచి ప్రాజెక్టులను కూడా ప్లాన్ చేసుకోవచ్చు.
* ఫ్రెండ్స్‌తో మాట్లాడేందుకు, గ్రూప్ చాట్ లేదా వీడియో కాల్స్ చేసుకోవటానికి వేర్వేరు యాప్స్ అవసరం లేదు. వీరీల్స్‌లోనే అన్నీ రకాల సౌకర్యాలు ఉంటాయి. Vreels క్రియేటివ్ వేదికగా ఉన్నందున ఇది సాధ్యపడింది. మీరు మాట్లాడుతూనే.. మీ ఆలోచనలను ఇతరులతో కూడా పంచుకోవచ్చు.
* స్నేహితులతో లేదా మీ కమ్యూనిటీ సభ్యులు ఎక్కడ ఉన్నారో.. ఈ యాప్‌లో V mapతో సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే లొకేషన్ షేరింగ్ అనేది పూర్తిగా మీ నియంత్రణలో ఉంటుంది.
* ఈ ఫీచర్‌లో భావోద్వేగ జ్ఞాపకాలను డిజిటల్‌గా ఒక క్యాప్సూల్‌లో ఉంచి, ఒక నిర్దిష్ట తేదీన దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. బర్త్‌డే, యానివర్సరీ, లేదా మైల్‌స్టోన్.. వంటి మధుర జ్ఞాపకాలను భద్రపరుచుకుని తిరిగి ఆ మెమొరీని చూసుకోవడం స్వీట్ మెమరీగా ఉంటుంది.
ప్రతస్తు ఈ ఏఐ ప్రపంచంలో మన డేటా ఎక్కడికి వెళ్తుందో.. ఎవరు వాడుతారో అన్న డౌట్ రావొచ్చు. కానీ, Vreelsలో ఈ విషయం గురించి భయం అక్కర్లేదు. ఇక్కడ యూజర్స్ డేటాకు అధిక భద్రత కల్పిస్తారు. టోకెన్ ఆధారిత ప్రామాణీకరణ, End-to-end encryption, యూజర్ నియంత్రిత ప్రైవసీ సెట్టింగులు.. ఇవన్నీ యూజర్ల వ్యక్తిగత డేటాను కాపాడటానికి తోడ్పడుతాయి.