BigTV English
Advertisement

kalvakuntla kavitha: కేటీఆర్, కేసీఆర్‌పై కుట్రలు.. బీఆర్ఎస్ నేత‌ల‌ గుట్టు విప్పుతున్న కవిత

kalvakuntla kavitha: కేటీఆర్, కేసీఆర్‌పై కుట్రలు..  బీఆర్ఎస్ నేత‌ల‌  గుట్టు విప్పుతున్న కవిత

kalvakuntla kavitha: పదే పదే తెలంగాణ జాగృతి కవిత తన ఓటమికి కారకులు వారే అంటూ చెప్పుకొస్తున్న మాటలు బీ ఆర్ ఎస్ పార్టీ లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి కవిత రెండో సారి పోటీ చేసిన సమయంలో పసుపు రైతులు పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేశారు. ఆమెపై అంతమంది నామినేషన్ లు వేయడానికి సహకరించింది ఎవరు? కవిత వారి సమస్యలు వినడానికి సిద్ధంగా ఉన్నా.. కవితను అంతా తాము చూసుకుంటామని చెప్పి మోసం చేసిన ఆ ఎమ్మెల్యేలు ఎవరు? అందుకే కవిత అక్కడ ఆ సమయంలో ఓటమి పాలయ్యారా?


2019 ఎన్నికల సమయంలో పసుపు రైతుల ఉద్యమం:

ఎప్పుడో ఓడిపోయిన కవిత విషయం ఇప్పుడు ఎందుకులే అనుకోవచ్చు.. కానీ కవిత ఎత్తుకున్న జనం బాటలో ఆమె ఓటమికి కారణాలు చెప్పుకొస్తూ … కొందర్ని టార్గెట్ చేస్తున్నారు. సరిగ్గా 2019 పార్లమెంటు ఎన్నికల్లో కవిత రెండోసారి టిఆర్ఎస్ అభ్యర్థిగా నిజామాబాద్ పార్లమెంట్ కోసం పోటీ చేసినప్పుడు ఉద్యమం రాజుకుంది. పసుపు రైతుల ఆందోళన సమయంలో వారితో సమావేశం ఏర్పాటు చేసిన కవిత వారికి మద్దతుగా నిలుస్తూ హామీ ఇవ్వడానికి సిద్ధమయ్యారట.

పసుపు రైతులకు కవితపై కోపం పెరిగేలా కుట్రలు:

అయితే ఆ సమయంలో పసుపు రైతులకు కవితపై వ్యతిరేకత పెరిగేలా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు కుట్రలు చేశారనేది ఇప్పటికీ జరుగుతున్న చర్చ. ఆ సమయంలో పసుపు రైతులతో మీటింగ్ అంటూ ఏర్పాటు చేసి, ఇటు కవిత మీటింగ్ కి రాకుండా అటు పసుపు రైతులకు కవితపై కోపం పెరిగేలా చేసి … రైతులు పెద్దఎత్తున కవిత పై పోటీ చేసేలా చేశారట ఆ ఎమ్మెల్యేలు. కవితకు వ్యతిరేకంగా 178 మంది పసుపు రైతులు నామినేషన్ దాఖలు చేయడంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వాసులు నిజామాబాద్ పార్లమెంట్ వైపు తిరిగి చూసేలా చేసింది.


కేసీఆర్ కుమార్తెపై పసుపు రైతులు ఆగ్రహంతో పార్లమెంట్ అభ్యర్థులుగా నామినేషన్లు వేయడంపై అప్పట్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. కవిత ఓటమి చెందాలని కుట్రలు పన్నిన అప్పటి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కవితపై నామినేషన్ లు వేసిన వారికి నామినేటెడ్ పదవులు, సర్పంచులుగా స్థానికి సంస్థల ఎన్నికల్లో టికెట్లు కూడా ఇచ్చి ప్రోత్సహించారని కవిత బహిరంగంగానే చెప్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డబ్బులు ఇచ్చి మరి కవిత ఓటమికి పన్నాగం:

అప్పట్లో పసుపు రైతులకు 90 వేల ఓట్లు వచ్చాయి. అవి ముమ్మాటికీ కవిత కు రావాల్సిన ఓట్లే అంటున్నారు. అవే కనుక చీలకుండా ఉంటే గనుక కవిత గెలిచే వారన్న ప్రచారం ఉంది. సొంత పార్టీ వారి కుట్రల వల్లే బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ గెలుపు సాధ్యమైందని చాలా సార్లు చెప్పుకొచ్చారు కవిత. అదలా ఉంటే కవిత ఓటమికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలే కాకుండా, కేసీఆర్ కి సన్నిహితులైన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు డబ్బులు ఇచ్చి మరి కవిత ఓటమికి పన్నాగం పన్నారని కవిత భావిస్తున్నారంట.

తన ఓటమిని కేటీఆర్‌కు వివరించిన కవిత:

కవిత తన ఓటమికి జరిగిన కుట్రలపై తన అన్న కేటీఆర్‌కు వివరించినప్పటికీ అలా ఎందుకు అనుకుంటావ్ అలాంటిదేమీ లేదు అని సర్ది చెప్పారంట. స్వయాన తండ్రి కెసిఆర్ వద్ద వెళ్లి చెప్పలేనప్పటికీ అన్నతో షేర్ చేసుకున్న ఆ విషయాలను సీరియస్‌గా తీసుకోకపోవడం ఆమెకు బాధ కలిగించిందట. పైగా రైతులు నామినేషన్ వేసిన సందర్భంలో స్క్రూటినీలో పలువురి ధరఖాస్తులు తొలగించాల్సినప్పటికీ.. ముందుగానే వారిని పిలిచి తప్పొప్పులు సరిదిద్దించి, నామినేషన్ల ఉపసంహరణ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారంట. పైగా అప్పటి కలెక్టర్‌తో దగ్గరుండి అప్పటి ఎమ్మెల్యేలు, కేసీఆర్ సన్నిహిత నేతలు దగ్గరుండి పనిచేయించారని కవిత ఆరోపిస్తున్నారు

జనంబాటలో తన ఓటమి వెనుక గుట్టు విప్పుతున్న కవిత:

ఇంతలా కవిత తనపై కుట్రలు చేసిన విషయాన్ని అటు తోబుట్టువుకు చెప్పినా పట్టించుకోకపోగా, తనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనే కుట్రతో పక్కనే ఉండి తండ్రి కేసిఆర్‌కి తెలియకుండా వ్యవహారాలు నడిపారని కవిత ఆరోపిస్తున్నారు. ఆఖరికి తనపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడున్నారని, సస్పెన్షన్ వేటు వేయించి పార్టీ నుంచి దూరం చేశారనేది కవిత ఆరోపణ. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చి తన ఓటమికి తన రాజకీయ జీవితంపై దెబ్బతీసేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరిని జనం బాటలో టార్గెట్ చేస్తున్నారట.

తగ్గేదే లే అంటూ గుట్టు బయట పెడుతున్న కవిత:

బీఆర్ఎస్‌లో అవినీతి ఫైళ్లకు సంబంధించి కేటీఆర్, కేసీఆర్ వెనుక కుట్రలు జరుగుతున్నాయని చాలాసార్లు చెప్పినప్పటికీ లైట్ తీసుకున్నారని చెప్తున్నారంట కవిత. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చాక ప్రజల్లో ఉండాలని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే అవినీతికి పాల్పడిన కుట్రలు చేసిన మాజీ మంత్రులు, ఎంఎల్ఏ, మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. ఇక ఎక్కడ తగ్గేదే లే అందరి గుట్టు బయట పెట్టడానికి సిద్దం అయ్యారని, జనం బాటకు హాజరవుతున్న జనం అభిప్రాయపడుతున్నారు. మరి కవిత ఇంకెంత మంది గుట్టు బయటపెడతారో? ఎవరెవరిని టార్గెట్ చేస్తారో చూడాలి.

Story by Apparao, Big Tv

Related News

Parakamani: పరకామణి కేసులో ఊహించని ట్విస్టులు..

P.V.N. Madhav: మాధవ్ వన్‌మాన్ షో.. ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది?

Jubilee Hills Bipole: బస్తిమే సవాల్.. జూబ్లీ గడ్డ.. ఎవరి అడ్డా?

Women’s World Cup 2025: కలగా మొదలై చరిత్రగా నిలిచిన ఇన్నింగ్స్.. జెమీమా TAKE A BOW

TS Cabinet: విస్తరణకు లైన్ క్లియర్ ఆ ఇద్దరికీ కీలక పదవులు?

CM Chandrababu: బాబు ముందుకు కొలికపూడి Vs కేశినేని చిన్ని పంచాయితీ!

AP Politics: జగన్, షర్మిల.. అవుట్ ఆఫ్ కవరేజ్..!

Big Stories

×