E-Paper
Advertisement

Allu Sirish -Nainika: అల్లు శిరీష్ నైనిక ప్రేమ వెనుక ఆ మెగా కపుల్ హస్తం ఉందా?సీక్రెట్ బయటపెట్టిన శిరీష్!

Allu Sirish -Nainika: అల్లు శిరీష్ నైనిక ప్రేమ వెనుక ఆ మెగా కపుల్ హస్తం ఉందా?సీక్రెట్ బయటపెట్టిన శిరీష్!
Advertisement

Allu Sirish -Nainika: అల్లు కుటుంబంలో ఎంతో ఘనంగా శుభకార్యం జరిగిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్(Sirish), నైనిక(Nainika)నిశ్చితార్థపు(Engagement) వేడుక గత రాత్రి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను మెగా అల్లు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక నైనిక బడా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి అల్లు ఇంటికి కోడలుగా అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా నైనికతో తన మొదటి పరిచయం ప్రేమ ఎలా మొదలైంది అనే విషయాలను బయటపెట్టారు.

నైనికతో తొలి పరిచయం అక్కడేనా..

ఇక నైనికతో తన పరిచయం వెనుక వరుణ్ తేజ్ (Varun Tej)లావణ్య త్రిపాఠి (Lavanya Tripati)ఉన్నారని ఈయన తెలియచేశారు. నేడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితమ పెళ్లి రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ఈ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా లావణ్య వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో హీరో నితిన్ భార్య శాలిని(Shalini) ఒక పార్టీ ఇచ్చారని తెలిపారు. ఆ పార్టీకి శాలిని బెస్ట్ ఫ్రెండ్ అయిన నైనిక రెడ్డి కూడా హాజరయ్యారని, ఆరోజు రాత్రి తాను మొదటిసారి నైనికను కలిశానని అల్లు శిరీష్ తెలిపారు.

నితిన్ భార్య శాలిని..

Advertisement

ఆరోజు మొదలైన మా పరిచయం రెండు సంవత్సరాల పాటు ప్రేమలో ఎంతో సంతోషంగా ఉన్నామని తెలిపారు. ఇక తమకు పిల్లలు పుడితే మా ప్రేమ ఎలా మొదలైందో చెప్పడానికి చాలా అద్భుతంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అల్లు శిరీష్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వరుణ్ తేజ్ లావణ్య కారణంగానే నైనిక తనకు పరిచయమైందని శిరీష్ చెప్పడంతో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ శిరీష్ నైనికలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక నైనిక రెడ్డి శాలినితో పాటు రానా వైఫ్ మిహికాకు కూడా మంచి స్నేహితురాలని తెలుస్తోంది.

వచ్చే ఏడాదిలో పెళ్లి ?

Advertisement

ఇలా రెండు సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థపు వేడుకను జరుపుకున్నారు. ఇక వీరి వివాహం ఎప్పుడు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇక వీరి పెళ్లి వచ్చే ఏడాదిలో ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ నిశ్చితార్థపు వేడుకలలో భాగంగా మెగా కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య మళ్లీ దూరం పెరిగింది అంటూ ఇటీవల వార్తలు చెక్కర్లు కొట్టాయి. ఉపాసన సీమంతపు వేడుకలలో అల్లు కుటుంబం కనిపించని నేపథ్యంలో మరోసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి కానీ శిరీష్ నిశ్చితార్థంతో ఈ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది.

Also Read: Lokesh Kanagaraj: హీరోయిన్ చేతిలో కం*డో*మ్.. హీరో గదిలో.. బోల్డ్ గా లోకి డీసీ టీజర్ !

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×