Womens World Cup 2025: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025) ఫైనల్ రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India Women vs South Africa Women, Final) రెండు తలపడతాయి. ముంబై వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మహిళల జట్టుకు బంపర్ ఆఫర్ తగిలింది. ఈ టోర్నమెంట్ లో ఛాంపియన్ గా నిలిస్తే, టీమిండియాకు భారీ నజరానా ఇస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India) ప్రకటన చేసిందట. ఐసీసీ ఇచ్చే ప్రైజ్ మనీతో పాటు బీసీసీఐ రూ.125 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ ప్రకటన నేపథ్యంలో కచ్చితంగా టీమిండియా ప్లేయర్లు బాగా ఆడి, దక్షిణాఫ్రికాను చిత్తు చేస్తారని అంచనా వేస్తున్నారు అభిమానులు.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబై లోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ ( Dr DY Patil Sports Academy, Navi Mumbai) వేదికగా జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. రెండున్నర గంటలకు టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇండియా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో… దక్షిణాఫ్రికా కంటే మనోళ్లకు ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. లోకల్ కండిషన్స్ టీమిండియాకు బాగా అలవాటు. ఏడుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియాను ఓడించిన టీమ్ ఇండియా… దక్షిణాఫ్రికాను సులభంగా ఓడిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలిచి ఛాంపియన్ గా నిలిస్తే రూ.125 కోట్లు ఇచ్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు భారత క్రికెట్ టీం సభ్యులకు కూడా సమాచారం అందించారట. డబ్బులు ఎక్కువగా వస్తాయన్న నేపథ్యంలో కూడా ప్లేయర్లు ఎక్కువ ఫర్ఫార్మెన్స్ చేసే ఛాన్సులు ఉంటాయి. అందుకే ఈ విషయాన్ని లీక్ చేసిందట బీసీసీఐ.
ఇక ఐసీసీ వన్డే మహిళకు 2025 టోర్నమెంటులో విజేతగా నిలిచిన జట్టుకు ఐసీసీ రూ.40 కోట్లు ఇవ్వనుంది. అలాగే ఫైనల్స్ లో ఓడిన రన్నరప్ జట్టుకు రూ. 20 కోట్లు అందుతాయి. సెమీ ఫైనల్ లో ఓడిపోయిన జట్లకు రూ. 9.3 కోట్ల చొప్పున ఇంగ్లాండ్ తో పాటు ఆస్ట్రేలియా కు దక్కుతాయి. ఇక గ్రూప్ స్టేజిలో ఎలిమినేట్ అయిన ఒక్కో జట్టుకు రూ. 5.8 కోట్లు వస్తాయి.
Also Read: Womens World Cup 2025: 1973 నుంచి వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన జట్లు ఇవే..టీమిండియా ఒక్కటి కూడా లేదా ?
Two nations. One dream 🇮🇳🇿🇦
Harmanpreet Kaur and Laura Wolvaardt stand on the precipice of #CWC25 history 🏆 pic.twitter.com/Kyq4WBSjqe
— ICC (@ICC) November 1, 2025