Actor Rajasekhar: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంగ్రీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు రాజశేఖర్(Rajasekhar) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈయన ఇటీవల కాలంలో సినిమాలను పూర్తిగా తగ్గించారని చెప్పాలి. యంగ్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ అప్పుడప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక త్వరలోనే బైకర్ (Biker)సినిమా ద్వారా రాజశేఖర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శర్వానంద్ (Sarwanand) మాళవిక నాయర్(Malavika Nayar) జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
డైరెక్టర్ అభిలాష్ కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1990- 2000ల బైక్ రేసింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ ల్యాప్ గ్లింప్ విడుదల చేశారు. ఇక ఈ గ్లింప్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సీనియర్ నటుడు రాజశేఖర్ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్లింప్ కనుక తాను ముందే చూసి ఉంటే కచ్చితంగా ఈ సినిమాలో హీరోగానే అవకాశం అడిగేవాడిని అంటూ సరదాగా మాట్లాడారు. ఈ సినిమాలో శర్వా నంద్ చాలా అద్భుతంగా నటించారని ఈయన తెలియజేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రాజశేఖర్ మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను గత కొంతకాలంగా ఒక సమస్యతో బాధపడుతున్నానని తెలిపారు. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ (IBS) అనే వ్యాధితో బాధపడుతున్నానని వెల్లడించారు. ఇక నిన్న అభిలాష్ వచ్చి రేపు ఈవెంట్ ఉంది మీరు మాట్లాడాలి అని చెప్పగానే ఆంగ్సైటి వల్ల నా కడుపు మొత్తం చెడిపోయిందని తెలిపారు. తాను తన మనసులో ఏముందో దాన్ని మాట్లాడుతున్నానని శర్వానంద్ మాత్రం ఈ సినిమాలో తన నటనతో అదరగొట్టారని రాజశేఖర్ తెలిపారు.
లేడీస్ హాస్టల్ కి తీసుకువెళ్తా..
ఇక ఈయన ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ సమస్యతో బాధపడుతున్నానని చెప్పడంతో ఈ వ్యాధి అంటే ఏంటి అని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ జబ్బు పెద్ద ప్రేగుకు వ్యాప్తి చెందుతుందని ఇది దీర్ఘకాలిక సమస్యగా వెంటాడుతుందని తెలుస్తోంది. ఈ వ్యాధి కారణంగా కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వెంటాడుతాయని తెలుస్తోంది. ఏది ఏమైనా గత కొంతకాలంగా ఇలాంటి జబ్బుతో బాధపడుతున్నానంటూ తాజాగా రాజశేఖర్ ఈ సినిమా వేడుకలో తెలియచేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీకు కనుక ఒక బైక్ ఇచ్చి జీవిత గారిని తీసుకెళ్లమంటే ఎక్కడికి తీసుకెళ్తారు అంటూ యాంకర్ సరదాగా అడిగారు. ఈ ప్రశ్నకు రాజశేఖర్ సమాధానం చెబుతూ తనని తీసుకెళ్లి లేడీస్ హాస్టల్ లో పడేస్తానంటూ సరదాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: Ram charan: గ్లోబల్ స్టార్ ట్యాగ్‌ను రిమూవ్ చేసిన రామ్ చరణ్… స్టార్స్ చూసి నేర్చుకోవాలి