BigTV English
Advertisement

YouTube Layoffs: దూసుకొస్తున్న కృత్రిమ మేధ.. యూట్యూబ్ ఉద్యోగులపై పిడుగు!

YouTube Layoffs: దూసుకొస్తున్న కృత్రిమ మేధ.. యూట్యూబ్ ఉద్యోగులపై పిడుగు!

YouTube Layoffs: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) యుగం నడుస్తోంది. దీంతో పలు దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ పేరిట ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సరికొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగులను తొలగించకుండా స్వచ్ఛందంగా వారినే బయటికి వెళ్లిపొమ్మని ‘వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్‌’ను ప్రకటించింది.


యూట్యూబ్ సీఈఓ ఏమన్నారంటే..

ఏఐ టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో యూట్యూబ్‌లో తప్పనిసరిగా కొన్ని మార్పులు చేయాల్సి వస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఈఓ నీల్ మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ‘అమెరికాలో పనిచేస్తున్న యూట్యూబ్ సిబ్బంది.. స్వచ్ఛందంగా తమ ఉద్యోగాన్ని వదులుకుంటే.. పరిహారం కింద వారికి ఎగ్జిట్ ప్యాకేజీలను అందిస్తాం’అని తెలిపారు.

కొత్త మార్పులు ఎప్పటినుంచి?

కంటెంట్ క్రియేషన్, వినియోగదారుడి అనుభవం వంటి వాటిని ఏఐ ప్రభావితం చేయనుంది. దీంతో అమెరికా ఉద్యోగులను స్వచ్ఛందంగా మీకు మీరుగా వెళ్లిపోండి అని ఆఫర్ చేసింది యూట్యూబ్. ఈ కొత్త మార్పులు  05 నవంబరు 2025 నుంచి అందుబాటులోకి రానున్నాయని యూట్యూబ్ తెలిపింది.


ఏఐ ఆధారిత కొత్త మోడల్స్..

ప్రపంచవ్యాప్తంగా గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు ఏఐ ఆధారిత మోడళ్లను అమలు చేస్తున్నాయి. యూట్యూబ్ కూడా అదే బాట పడుతోంది. కంటెంట్ క్రియేషన్, ఎడిటింగ్, సబ్ టైటిలింగ్, కంటెంట్ మోనిటైజేషన్‌లో కృత్రిమ మేధ వినియోగాన్ని విస్తృతం చేయాలని యూట్యూబ్ ఈ చర్యలు చేపట్టింది.

త్వరలో కీలక మార్పులు..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వినియోగదారుడి ప్రిఫరెన్స్ గుర్తించడం, వీడియో సిఫార్సులు మరింత కచ్చితంగా ఇవ్వడం వంటి మార్పులు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. యూట్యూబ్ తన పునర్నిర్మాణంలో భాగంగా.. ప్రొడక్ట్ డివిజన్‌ను వ్యూయర్ ప్రొడక్ట్స్, క్రియేటర్ అండ్ కమ్యూనిటీ ప్రొడక్ట్స్, సబ్‌స్క్రిప్షన్ ప్రొడక్ట్స్ వంటి మూడు విభాగాలుగా విభజించినట్లు తెలుస్తోంది.

ఉద్యోగుల భవితవ్యంపై ప్రశ్న..

యూట్యూబ్ తీసుకొచ్చిన ‘వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్’ను ఈ సంస్థ వినూత్నంగా ఆలోచించినప్పటికీ.. ఉద్యోగుల కెరీర్‌పై ఇది ఎంతగానో ప్రభావం చూపుతుంది. అలాగే కొంత మంది ఉద్యోగులు తమ భవిష్యత్తు పట్ల ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. మరికొందరు అయితే, ఏఐ ఆధారిత నూతన అవకాశాలు, క్రియేటివ్‌ రంగంలో కొత్త జాబ్‌ రోల్స్‌ లభిస్తాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు.

Related News

Google Pixel 9 Series: భారత మార్కెట్లో సంచలనం సృష్టించిన గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌.. ధర చూస్తే వావ్ అనాల్సిందే..

Motorola Edge 70 Ultra 5G: ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లకు సవాల్.. 125W ఛార్జింగ్‌తో రాకెట్‌లా దూసుకెళ్తున్న మోటరోలా ఎడ్జ్ 70 అల్ట్రా..

Redmi Note 15 Smartphone: రూ.12వేలకే హై ఫీచర్స్.. 5800mAh బ్యాటరీతో రెడ్‌మి నోట్ 15 ఫస్ట్ లుక్

Vivo X 400 Pro Max: వివో ఎక్స్400 ప్రో మాక్స్ అద్భుత ఫీచర్లు.. కెమెరా, బ్యాటరీ, స్పీడ్ అన్నీ లెవెల్ మించి..

OnePlus 15 Pro: 8400mAh బ్యాటరీతో దుమ్ము దులిపే ఫోన్.. వన్‌ప్లస్ 15 ప్రో ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Oppo Find X8: ఒప్పో ఫైండ్ X8.. పనితీరుతో ఆండ్రాయిడ్ ప్రపంచాన్నే మార్చిన ఫ్లాగ్‌షిప్

China Influencers: రీల్స్ చేసేవారికి చైనా కొత్త రూల్.. ఇవన్నీ ఉంటేనే అందుకు అనుమతి, లేకుంటే?

Big Stories

×