ISRO LVM3-M5 Mission: బహుబలి రాకెట్ ప్రయోగానికి ఇస్రో రెడీ అయింది. రేపు(ఆదివారం) సాయంత్రం 5.26 గంటలకు 4,000 కిలోల కంటే ఎక్కువ బరువున్న CMS-03 కమ్యూనికేషన్ శాటిలైట్ ను నింగిలోకి ప్రయోగించనుంది. LVM3-M5 లాంచ్ వెహికల్ లో ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఏపీలోని శ్రీహరికోట నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించనున్నారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన జీశాట్-7R కమ్యూనికేషన్ శాటిలైట్ ను ప్రయోగించనున్నారు. ఇది పదేళ్ల పాటు ఇంటర్నెట్ సేవలు అందించనుంది. దాదాపు 4,410 కిలోల బరువున్న శాటిలైట్ ను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ లోకి ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్ ప్రయోగించిన అత్యంత బరువైన శాటిలైట్ అవుతుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది.
బాహుబలి శాటిలైట్ ను నింగిలోకి తీసుకెళ్లేందుకు LVM3-M5 రాకెట్ ను ఉపయోగించనున్నారు. ఈ ప్రయోగానికి అంతా సిద్ధం చేశామని ఇస్రో శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వాహక నౌకను రెండో ప్రయోగ వేదికకు తరలించామని ఇస్రో తెలిపింది. 4,000 కిలోల కన్నా బరువైన భారీ పేలోడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యం కోసం ‘బాహుబలి’గా పిలిచే 43.5 మీటర్ల పొడవైన ఈ రాకెట్ నవంబర్ 2న సాయంత్రం 5.26 గంటలకు ప్రయోగించనున్నారు.
లాంచ్ వెహికల్ మార్క్-3(LVM3) ఇస్రో కొత్త హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్. 4 వేల కిలోల పేలోడ్ ను నింగిలోకి మోసుకెళ్లేందుకు ఈ అంతరిక్ష నౌకను ఇస్రో ఉపయోగిస్తుంది. దీనికి రెండు సాలిడ్ మోటార్ స్ట్రాప్-ఆన్‌లు (S200), ఒక లిక్విడ్ కోర్ స్టేజ్ (L110), ఒక క్రయోజెనిక్ స్టేజ్ (C25) మూడు దశల్లో ప్రయోగించనున్నారు. LVM3ను జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) MkIII అని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు పిలుస్తారు.
Countdown Commences!
Final preparations complete and the countdown for #LVM3M5 has officially begun at SDSC-SHAR.
All systems are GO as we move closer to liftoff! ✨
For more Information Visithttps://t.co/yfpU5OTEc5 pic.twitter.com/6pPYS5rl9d
— ISRO (@isro) November 1, 2025
ఇస్రో డిసెంబర్ 5, 2018న ఫ్రెంచ్ గయానాలోని కౌరౌ లాంచ్ ప్యాడ్ నుంచి అరియన్-5 VA-246 రాకెట్ ప్రయోగించింది. బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని GSAT-11 ద్వారా ఇస్రో ప్రయోగించింది. దాదాపు 5,854 కిలోల బరువున్న GSAT-11 ఇస్రో నిర్మించిన అత్యంత బరువైన శాటిలైట్. రేపు(ఆదివారం) CMS-03, మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ భారత భూభాగంతో పాటు సముద్ర ప్రాంతంలో సేవలను అందిస్తుందని ఇస్రో తెలిపింది.
Also Read: CM Chandrababu: నిద్రలో కూడా ప్రజల గురించే ఆలోచిస్తా.. ఇదే నా విజన్: సీఎం చంద్రబాబు
LVM-3 రాకెట్ ద్వారా ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ క్క విజయవంతమైంది. దీంతో 2023లో చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారత్ అవతరించింది.