BigTV English
Advertisement

P.V.N. Madhav: మాధవ్ వన్‌మాన్ షో.. ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది?

P.V.N. Madhav: మాధవ్ వన్‌మాన్ షో.. ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది?

P.V.N. Madhav: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాగా వేయాలన్న బీజేపీ కల ఆంధ్రప్రదేశ్ లో తీరేనా?. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో బీజేపీ ఉనికి మాత్రం నామమాత్రంగా మారింది. రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తే జోష్ వస్తుందనుకుంటే ఉన్న వాళ్ళు దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఆ పార్టీకి క్యాడర్ ఉందా? ఉంటే ఏం చేస్తోంది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పదవులు పొందిన వారు బయట కనిపించడమే మానేస్తున్నారు. కొత్త ప్రెసిడెంట్ మాధవ్ వన్‌మాన్‌షోతో ఉన్న కాస్తమంది సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంట. అసలు ఏపీ బిజెపిలో ఏం జరుగుతోంది?


తమ తఢాఖా ఏంటో చూపిస్తామంటున్న మాధవ్:

ఏపీ బిజెపి అధ్యక్షుడిగా పి.వి.ఎన్. మాధవ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్ర పార్టీలో వన్ మాన్ షో నడుస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఏపిలోని అన్ని జిల్లాలు తిరుగుతూ, మధ్య మధ్యలో ఢిల్లీ వెళ్ళి పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ, కూటమి సభల్లో నేను కూడా ఉన్నానంటూ దూరపు చుట్టంగా వెళ్శివస్తున్న మాధవ్ పార్టీ పై దృష్టి సారించడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మాధవ్ పార్టీని గాడిలో పెట్టడంలో అంత పరిపక్వత చూపించలేకపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మాధవ్ అధ్యక్షుడిగా వచ్చినప్పుడు కొత్త కమిటీలు వేగంగానే వేసేశారు. క్షేత్రస్ధాయి నుంచి పార్టీని బలోపేతం చేసేలా కష్టపడి పనిచేయాలని సూచనలు చేశారు. ఇంకేముందు పదవులు పొందిన వారు రేపటినుంచి తమ తడాఖా ఏంటో చూపిస్తామని ప్రగల్భాలు పలికారు. అయితే వారంతా ఇప్పటిదాకా కానరాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.


వైసీపీ పై విరుచుకుపడుతున్న సత్యకుమార్ యాదవ్:

కూటమి ప్రభుత్వంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 3 ఎంపిలు కూడా గెలిచారు. ఒక కేంద్ర మంత్రి తో పాటు ఒక రాష్ట్ర మంత్రి ఉన్నారు. కేంద్ర మంత్రి కేంద్ర పధకాలను వివరించడానికి పరిమితమవుతుంటే.. రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌యాదవ్ ఒక్కరే వైసిపిపై విరుచుకుపడుతుంటారు. మిగతా ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు మమ అనిపిస్తున్నారు. మరోవైపు మాధవ్ తో పాటు రాష్ట్ర కమిటీ లో వివిధ మోర్చాల్లో బాధ్యతలు స్వీకరించిన వారు అసలు ఉన్నారా ఉంటే ఎక్కడ ఉన్నారనేది తెలియని పరిస్ధితి.

కమాండింగ్ చేయడంలో విఫలమవుతున్న మాధవ్:

మాధవ్ వచ్చినప్పుడు మాత్రం ఆయన ముందు హడావుడి చేసేసి తర్వాత సొంత పనుల్లో పడిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన సోమూవీర్రాజు, పురంధేశ్వరి వంటి వారు పార్టీని లైన్‌లో పెట్టడానికి ప్రయత్నించేవారు. పార్టీలో చురుకుగా లేని వారిని తమదైన స్టైల్లో హ్యాండిల్ చేసి పార్టీ కోసం పనిచేసేలా చేశేవారు. కాని మాధవ్ మాత్రం కమాండింగ్ చేయలేకపోతున్నారని టాక్ నడుస్తోంది. ప్రత్యర్ధి పార్టీల విమర్శలను తిప్పికొట్టడంలో సరైన టీం ను ఎంచుకోలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మాధవ్ చుట్టూ పెరిగిపోయిన భజనపరులు:

ప్రస్తుతం బిజెపి ని తిట్టినా స్పందించే వారే పార్టీలో కరువయ్యారంటే రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు మాధవ్ చుట్టూ భజన పరులు ఎక్కువై ఆహా ఓహో అని ఆకాశానికి ఎత్తుతుండటంతో బిజెపి అధ్యక్షుడు మాధవ్ పార్టీని సరైన రీతిలో నడపలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్లను కలుపుకొని పోవడం లేదనేది కొందర వాదన.

ప్రజల్లోకి బిజేపీ నినాదం వెళ్ళడం లేదంటూ టాక్:

మరోవైపు మాధవ్ ఉదయం నుంచి రాత్రి దాకా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ప్రజల్లోకి బిజెపి నినాదం వెళ్ళడం లేదనేది టాక్. మోడీ ఇప్పటికే పలుమార్లు ఏపీకి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతుంటే దాన్ని టిడిపి, జనసేన ఓన్ చేసుకుంటున్నాయి కాని సొంత పార్టీ అయిన బిజెపి మాత్రం ఓన్ చేసుకోలేకపోతుందన్న చర్చ నడుస్తోంది. కూటమి ఏ కార్యక్రమం నిర్వహించినా అటు సిఎం, డిప్యూటీ సిఎం స్ధాయి నుంచి కింది స్ధాయి కార్యకర్త వరకు మోడీ జపం చేస్తారే తప్ప ఏపీ అధ్యక్షుడి మాట కూడా పలకడం కాదు కదా బ్యానర్లపై కూడా ఎక్కడా ఫోటో కూడా కనిపించనీయడం లేదు.

ఇలాంటి పరిస్ధితుల్లో బీజేపీ బలోపేతం కాదు కదా.. అసలు దాని భవితవ్యం ఏంటనికార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పార్టీ గట్టెక్కాలంటే మాధవ్ ఖచ్చితంగా భజన పరులను దూరం పెట్టి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప పార్టీ బలోపేతం కాదనేని సీనియర్ల అభిప్రాయపడుతున్నారు. చూడాలి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు మాధవ్ ఇప్పటికైనా భజనపరుల భజనల నుంచి బయటపడి రియాలిటీలోకి వస్తారో? లేదో?

Story by Apparao, Big Tv

Related News

Kashibugga: కాశీబుగ్గ దుర్ఘటన.. మృతుల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్‌గ్రేషియా

Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే: మాజీ సీఎం జగన్

Parakamani: పరకామణి కేసులో ఊహించని ట్విస్టులు..

ISRO LVM3-M5 Mission: ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్.. రేపు సాయంత్రం నింగిలోకి LVM3-M5

CM Chandrababu: నిద్రలో కూడా ప్రజల గురించే ఆలోచిస్తా.. ఇదే నా విజన్: సీఎం చంద్రబాబు

Srikakulam News: కాశీబుగ్గ టెంపుల్ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంది.. ఘటనపై మంత్రి ఆనం స్పందన ఇదే..

Stampede At Kasibugga: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా

Big Stories

×