Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాన్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సైక్లోన్ ప్రభావం కారణంగా వేల కోట్ల నష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొంథా తుఫాన్ రైతులకు కన్నీటిని మిగిల్చింది. ముఖ్యంగా తెలంగాణ వరంగల్, హన్మకొండ, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొట్టాయి. వరంగల్, హన్మకొండ నగరాలు వరదలతో మునిగిపోయాయి. వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో ఓరుగల్లు వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే తుఫాన్ ఎఫెక్ట్ ఇంకో 24 గంటలు కొనసాగితే మాత్రం.. వరంగల్ సిటీ మునిగిపోయేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వరంగల్ నగరంలో ఇళ్లల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అప్పులు చేసి పంట పండించి.. కరెక్ట్ పంట చేతికి వచ్చే సమయానికే తుఫాన్ బీభత్సం సృష్టించండంతో లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు రైతులు పొలాల వద్దకు వెళ్లి ఏడుస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలు కనిపిస్తున్నాయి.
అయితే.. తెలంగాణ రాష్ట్ర ప్రజలను వాతావరణ శాఖ అధికారులు మరోసారి అలర్ట్ చేశారు. బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలలో తెలుగు రాష్ట్రాలపై తుఫాన్ బీభత్సం సృష్టిస్తుందని చెబుతున్నారు. తెలంగాణలో మరో మూడు రోజులు కుండపోత వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఈ నెల 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే అల్పపీడన ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాబోయే 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి – భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. ఇతర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడతాయని వివరించారు. ఇక హైదరాబాద్ లో సాయంత్రం, రాత్రి సమయంలో కొన్ని చోట్ల వర్షాలు పడతాయని.. అయితే కొన్ని చోట్ల పొడి వాతావరణం కొనసాగే ఛాన్స్ ఉందని అన్నారు. రేపు హైదరాబాద్ నగరంతో సహా దక్షిణ, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపారు.
మరి కాసేటపట్లో రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి – భువనగిరి, వికారాబాద్, సిద్దిపేటలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. తెలంగాణ పశ్చిమ, మధ్య జిల్లాల్లో రాత్రిపూట మరిన్ని చెల్లాచెదురుగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. హైదరాబాద్ ఈస్ట్ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని తెలిపారు.