Whatsapp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్స్ ను కలిగి ఉన్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఈ యాప్ ఎప్పటికప్పుడు తన యూజర్స్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. మెటా ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ వాట్సాప్.. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ తో యూజర్స్ ను ఆకట్టుకోవడానికి సిద్ధమైపోతుంది.
మెటా సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వాట్సాప్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ను సంతరించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక మెటా ఆధ్వర్యంలో వాట్సప్ తో పాటు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ సైతం నడుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వాట్సాప్ లో వచ్చిన కొత్త ఫీచర్ తో కేవలం వాట్సాప్ స్టేటస్ గా మాత్రమే కాకుండా ఒక స్టేటస్ ను ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లో కూడా స్టోరీలుగా పెట్టే ఛాన్స్ మెటా కల్పించింది. ఈ ఫీచర్స్ తో ప్రతీ ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసి ప్రత్యేకంగా స్టేటస్ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విషయాన్ని మెటా తన బ్లాక్ లో పంచుకుంది.
వాట్సాప్ లో స్టేటస్ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ ఒక్కరు తమకు నచ్చిన విషయాన్ని స్టేటస్ ఆఫ్షన్ లో ఎంచుకుంటున్నారు. దీనికి లైక్స్ తో పాటు కామెంట్ చేసే ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇక వాట్సప్ స్టేటస్ ను ఫేస్ బుక్ స్టోరీగా పెట్టుకోవాలనుకుంటే ప్రత్యేకంగా ఫేస్ బుక్ ను ఓపెన్ చేసి స్టేటస్ పెట్టాల్సి వచ్చేది. కానీ ఇకపై అలాంటి అవసరం లేకుండా వాట్సాప్ లో పెట్టే స్టేటస్ ను నేరుగా ఫేస్ బుక్ స్టోరీగా క్రియేట్ చేయవచ్చు. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ స్టోరీ గా కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండు ఫ్లాట్ఫామ్స్ లో ఒకేసారి వాట్సాప్ స్టోరీ ను అప్డేట్ చేసుకోవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా ప్రతీ యాప్ కు వెళ్లి అప్డేట్ చేయాల్సిన అవసరం ఉండదు.
ALSO READ : రూ.6 వేలకే ఏఐ కెమెరాతో కొత్త మెుబైల్
వాట్సాప్ లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ ను సెట్టింగ్స్ కు వెళ్లి మార్చుకోవాల్సి ఉంటుంది. స్టేటస్ పెట్టే సమయంలో ఫేస్ బుక్ స్టోరీ గా, ఇన్స్టాగ్రామ్ స్టోరీ గా కూడా పెట్టే ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిని అనేబుల్ చేసుకుంటే ఇక మిగిలిన యాప్స్ లో కూడా ఇదే స్టేటస్ కనిపిస్తుంది. ఒకవేళ వద్దు అనుకుంటే డిసేబుల్ చేసుకోవచ్చు. మెటా త్వరలోనే ఈ ఫీచర్ ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటుకు తీసుకురాబోతుంది. దీంతో పాటు మెటా ఏఐ స్టిక్కర్స్, అవతార్స్ ను సైతం త్వరలోనే వాట్సప్ లో అందుబాటులోకి తీసుకురాబోతుంది.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్స్ ను కలిగి ఉన్న వాట్సాప్ ఇండియాలో కూడా ఎంతో మంది యూజర్స్ ను కలిగి ఉంది. వీరందరి కోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు ఆధునాతన ఫీచర్స్ ను తీసుకొస్తుంది. ఈ మధ్య కాలంలో వాట్సప్ తీసుకొస్తున్న లేటెస్ట్ ఫీచర్స్ ఎందరో యూజర్స్ ను ఆకట్టుకుంటున్నాయి.