Lava Yuva Smart Phone : ఇండియన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా ఎప్పటికప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ ను లాంఛ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన యూజర్స్ కోసం అతి తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్ మొబైల్స్ ను ఇవ్వడంలో ముందుంటుంది ఈ సంస్థ. తాజాగా గత ఏడాది యువ 2 పేరిట కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన లావా.. ఇప్పుడు మరో కొత్త మొబైల్ ను తీసుకొచ్చేసింది. ఈ మొబైల్ ఫీచర్స్ ప్రస్తుతం యూజర్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
Lava Yuva స్మార్ట్‌ఫోన్.. ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా తీసుకొచ్చిన బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ ఆధునిక సాంకేతికతను అతి తక్కువ ధరకే అందిస్తుంది. ఇక ఈ మెుబైల్ పీచర్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
Lava Yuva Smart Phone Features –
ఈ ఫోన్ లో 6.5 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే, 1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉన్నాయి. 20:9 ఆస్పెక్ట్ రేషియోతో హై వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లో MediaTek Helio G37 ప్రాసెసర్ ఉండటంతో యాప్స్, లైట్ గేమింగ్ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది.
ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్న యూజర్స్ కు ఈ మెుబైల్ బెస్ట్ ఆఫ్షన్. Lava Yuva స్మార్ట్‌ఫోన్ 13MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో కెమెరాతో 3 రేర్ కెమెరాలను అందిస్తుంది. ఆన్‌టూ ఫ్రంట్ కెమెరా 8MP ఉంటుంది. ఈ మెుబైల్ తో శార్ప్, క్లియర్ సెల్ఫీలు తీసే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫోన్ లో AI బ్యూటీ కెమెరా, HDR, పోర్ట్రేట్ మోడ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇవి ఫోటోలు మరింత క్లియర్ గా తీయటానికి ఉపయోగపడతాయి
ఇందులో 5000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. సింగిల్ చార్జ్‌తో రోజంతా పనిచేస్తుంది. 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ Lava Yuva స్మార్ట్‌ఫోన్ లో 3GB / 4GB RAM, 32GB / 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు 256GB వరకు మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ ను విస్తరించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ తో, స్టాక్ ఆండ్రాయిడ్ UI ఉండటం వల్ల యూజర్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్ గా ఉంటుంది.
ఈ ఫోన్ లో కనెక్టివిటీ పరంగా 4G VoLTE, Wi-Fi, Bluetooth 5.0, GPS వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. సెక్యూరిటీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. ధర విషయానికి వస్తే.. Lava Yuva స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ.8,000 నుండి రూ.10,000 మధ్య ఉంటుంది. కాగా ఈ ధర వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ వివిధ రంగుల్లో అందుబాటులో ఉంది. వాటిలో సిల్వర్, బ్లూ, డార్క్ గ్రే వంటి ఆకర్షణీయమైన ఆప్షన్లు ఉన్నాయి. ఫైనల్లీ.. బడ్జెట్లో బెస్ట్ మెుబైల్ కొనాలనుకునే యూజర్స్ కు Lava Yuva బెస్ట్ ఆఫ్షన్. ఇది ఆల్ రౌండ్ పనితీరు, సరసమైన ధరతో యూజర్లకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.
ALSO READ : కుంభమేళాలో కోట్లాది భక్తులు.. కానీ నెట్వర్క్ సమస్యేలేదు!