Xiaomi Pad 6 Tablet Price: షియోమి ప్యాడ్ 6 అనేది 2023 ఏప్రిల్‌లో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇప్పటికీ ఈ మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ కు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం దీని ధర ఇండియాలో రూ.20,000 నుంచి రూ. 27,000 రేంజ్ లో అందుబాటులో ఉంది. గేమింగ్, మ్యూజిక్, వీడియో స్ట్రీమింగ్, నోట్ టేకింగ్‌కు ఐడియల్ గా ఈ ట్యాబ్లెట్ పని చేస్తుంది. ప్రాసెసర్, డిస్ ప్లే, బ్యాటరీ లైఫ్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. కానీ GPS లేకపోవడం, మెమరీ కార్డ్ స్లాట్ లేకపోవడం లాంటి కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి.
⦿ డిస్ ప్లే: 11-ఇంచ్ IPS LCD, 2880×1800 పిక్సెల్స్, 144Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, 550 నిట్స్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని కలిగి ఉంటుంది.
⦿ ప్రాసెసర్: Qualcomm Snapdragon 870, Adreno 650 GPUను కలిగి ఉంటుంది.
⦿ RAM & స్టోరేజ్: 6GB,8GB LPDDR5 RAM, 128GB, 256GB UFS 3.1 స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
⦿ కెమెరాలు: 13MP బ్యాక్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
⦿ బ్యాటరీ: 8840mAh బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ తో వస్తుంది. 2 గంటల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది.
⦿ ఆపరేటింగ్ సిస్టమ్: Android 13, HyperOS అప్ డేట్ తో పాటు వస్తుంది.
⦿ ఆడియో: Dolby Atmos క్వాలిటీతో వస్తుంది.
⦿ కనెక్టివిటీ Wi-Fi 6, బ్లూటూత్ 5.2, USB-C 3.2 ఉంటాయి. SIM, GPS, 3.5mm జాక్ లేదు.
⦿ డిజైన్: 253.95 x 165.18 x 6.51mm స్క్రీన్ సైజ్ తో పాటు 490 గ్రాముల బరువు ఉంటుంది. అల్యూమినియం బాడీ, గ్రే, మిస్ట్ బ్లూ, గోల్డ్ కలర్స్ లో వస్తుంది.
Read Also: 55 ఇంచుల టీవీపై ఏకంగా 75 శాతం తగ్గింపు.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ కొనలేరట!
⦿ 6GB RAM + 128GB రూ. 20,999 – రూ. 23,899 ఉంటుంది.
⦿ 8GB RAM + 256GB రూ.21,499 – రూ.26,999 ఉంటుంది.
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో మరింత తగ్గింపు ధరలకు లభించే అవకాశం ఉంటుంది. పలు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
⦿ GPS-SIM సపోర్ట్ లేదు.
⦿ No 3.5mm జాక్, మెమరీ కార్డ్ స్లాట్.
⦿ బేసిక్ కెమెరాలు మాత్రమే ఉన్నాయి.
⦿ HyperOSలో కొన్ని యూజర్స్ యాడ్స్ గురించి కంప్లైన్ చేశారు.
Read Also: 1500: తక్కువ ధరలో బెస్ట్ హెడ్‌ఫోన్స్ కావాలా? వీటిని ట్రై చేయండి!