Australia: ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023లో భారత్ ని ఆస్ట్రేలియా ఓడించిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ ఓ చేతిలో బీరు సీసా పట్టుకొని ప్రపంచ కప్ ట్రోఫీ పై తన కాళ్ళను పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ ఫోటో చూసిన భారత క్రీడాభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఈ వివాదం పై మార్ష్ స్పందించాడు. వరల్డ్ కప్ ట్రోఫీ పై కాలు పెట్టడంలో తప్పేముందని.. తాను మళ్ళీ అలా చేయడానికి కూడా వెనకాడనని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Also Read: Kasturi -Jemimah: జెమిమా రోడ్రిగ్స్ పై నటి కస్తూరి సీరియస్.. నీకు మెడ మీద తలకాయ ఉందా?
ఆస్ట్రేలియా ఆటగాడు మిచల్ మార్ష్ చేసిన ఈ ఒక్క తప్పుకు ఆస్ట్రేలియా జట్టుకు దరిద్రం పట్టుకుందని ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రోఫీపై కాళ్లు పెట్టినప్పటి నుండి ఆస్ట్రేలియా మరే ట్రోఫీ గెలవడం లేదని.. ఆ ఒక్క తప్పిదం వల్ల పట్టిన దరిద్రాన్ని ఇక అనుభవించాల్సిందేనని ఓ వార్త వైరల్ అవుతుంది. అప్పటినుండి జరిగిన అన్ని పరాభవాలే ఇందుకు నిదర్శనం.
2024 టి-20 ప్రపంచ కప్ లో సూపర్ – 8 పోరులో భాగంగా ఆస్ట్రేలియా – భారత్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ని భారత్ 24 పరుగుల తేడాతో ఓడించింది. భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత 2024లో యూఏఈ వేదికగా జరిగిన మహిళల టి-20 ప్రపంచ కప్ లో.. టైటిల్ హాట్ ఫేవరెట్ గా ఉన్న ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టు సెమీస్ లో ఓడిపోయి ఇంటి బాట పట్టింది. సౌత్ ఆఫ్రికా తో జరిగిన తొలి సెమీఫైనల్ లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియా.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. 6 సార్లు టి-20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. 15 సంవత్సరాల తర్వాత ఈ మెగా టోర్నిలో సెమీస్ లో ఓడిపోయింది.
Also Read: Team India: మోడీ సార్… గంభీర్, అగర్కార్ ను మీరైనా తీసేయండి.. టీమ్ ఇండియాను కాపాడండి!
ఆ తరువాత ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ {WTC} మూడవ రౌండ్ {2023-25} ఫైనల్ లో ఆస్ట్రేలియా తో దక్షిణాఫ్రికా హోరాహోరీగా తలపడింది. లండన్ లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సౌత్ ఆఫ్రికా చిత్తు చేసింది. తద్వారా 27 సంవత్సరాల తరువాత తొలిసారి ఐసీసీ టైటిల్ సాధించింది. ఇక ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న ఉమెన్ వన్డే వరల్డ్ కప్ సెమి ఫైనల్ లో భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఇలా ట్రోఫీపై కాలు పెట్టిన పాపానికి ఆస్ట్రేలియా వరుస ఓటములను చవిచూస్తుందని అభిప్రాయపడుతున్నారు క్రీడాభిమానులు.