Postal Senior Citizens Scheme: పదవీ విరమణ తర్వాత చాలా మందికి ఆర్థిక స్థిరత్వం చాలా ముఖ్యంగా మారుతుంది. రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు పోస్టల్ శాఖ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) సహాయపడుతుంది. పోస్టాఫీసు ఎస్సీఎస్ఎస్ ఖాతా ఆర్థిక స్థిరత్వంతో పాటు అధిక వడ్డీ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం ఈ స్కీమ్ ను రూపొందించింది. ఇది సీనియర్ సిటిజన్ల పెట్టుబడికి భద్రత, స్థిరమైన రాబడిని అందిస్తుంది.
ఈ పథకం కింద డిపాజిట్ చేసిన డబ్బుకు భారత ప్రభుత్వం హామీ ఇస్తుంది. మీ డిపాజిట్‌లపై వచ్చే వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఖాతాల్లో జమ చేస్తుంది. దీనిని సాధారణ ఖర్చులకు లేదా పదవీ విరమణ తర్వాత ఆదాయ వనరుగా ఉపయోగించుకోవచ్చు. ఈ స్కీమ్ లో ప్రత్యేక అధిక వడ్డీ చెల్లింపు. ప్రతి నాలుగు నెలలకు అత్యధికంగా రూ. 61,500 వరకు వడ్డీ పొందవచ్చు. ఎటువంటి మార్కెట్ రిస్క్ లేకుండా ఈ స్కీమ్ లో రాబడిని అందిస్తుంది పోస్టల్ శాఖ.
ఎస్సీఎస్ఎస్ ఖాతాను తెరిచేందుకు మీకు సమీపంలోని పోస్టాఫీసును సందర్శించి దరఖాస్తు ఫామ్‌ను నింపాలి. ఈ ఫామ్ పోస్టల్ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫామ్‌లో మీ వివరాలు నింపి, ఫోటోగ్రాఫ్‌ను జతచేయాలి. అలాగే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్, అడ్రస్ ఫ్రూఫ్, వయస్సు రుజువుకు అవసరమైన పత్రాలను సమర్పించాలి. వీఆర్ఎస్ లేదా పదవీ విరమణ తర్వాత ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అకౌంట్ ఓపెన్ సమయంలో పదవీ విరమణ రుజువును సమర్పించాలి. ఫామ్‌ను సమర్పించే సమయంలో డిపాజిట్ ను చెక్కు లేదా నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ లో ప్రస్తుతం 8.2% వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది కేంద్రం. మార్చి 31, జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికం ఆధారంగా ప్రతి మూడు నెలలకు వడ్డీ ఖాతాల్లో జమ చేస్తారు. డిపాజిట్ తేదీ నుంచి వడ్డీ లెక్కిస్తారు. ఖాతాదారుడు ప్రతి త్రైమాసికంలో వడ్డీని విత్ డ్రా చేసుకోకపోతే ఆ మొత్తంపై అదనపు వడ్డీ ఉండదు.
Also Read: LPG Gas Price: తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు.. చిరు వ్యాపారులకు స్వల్ప ఊరట
మీరు ఎస్సీఎస్ఎస్ఎస్ ఖాతాను పొడిగించుకోవచ్చు. ప్రతిసారీ 3 ఏళ్ల పాటు ఈ ఖాతాను పొడిగించుకోవచ్చు. ఖాతాను పొడిగించుకోవడానికి ఫామ్‌ను పూరించి పోస్టాఫీసులో సమర్పించాలి.