Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 7 మంది భక్తులు మృతి చెందినట్టు సమాచారం. ఏకాదశి సందర్బంగా భారీగా భక్తులు తరలివచ్చారు. ఇంత సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేయలేకపోయారు. ఊహించని సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఒక్కసారిగా భక్తులు ముందుకు తోసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా రెయిలింగ్ ఊడిపోవడంతో అక్కడున్న వారంతా కింద పడిపోయారు. ఒకరిమీద ఒకరు పడటంతో ఊపిరి ఆడక మహిళా భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు, ఒక చిన్నారి మృతి చెందినట్టు సమాచారం. మరి కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి.