Chatrapathi Sekhar:ఛత్రపతి శేఖర్(Chatrapathi Sekhar) .. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli )ఏ చిత్రం చేసినా అందులో ఈయనకు ఒక పాత్ర కల్పిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మహేష్ బాబు (Maheshbabu) రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29) సినిమాలో ఈయనకు అవకాశం కల్పించారో లేదో తెలియదు కానీ స్టూడెంట్ నెంబర్ వన్ మొదలుకొని ఆర్ఆర్ఆర్ వరకు చాలా సినిమాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా స్టూడెంట్ నెంబర్.1, సింహాద్రి, సై, విక్రమార్కుడు, ఛత్రపతి, మగధీర , ఆర్ఆర్ఆర్ ఇలా తెలుగులో అనేక హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. సినిమాలలోనే కాదు సీరియల్స్ లో కూడా నటించిన ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. తాను తన భార్య నుంచి విడిపోవడానికి గల కారణాలు చెప్పి ఆశ్చర్యపరిచారు.
ఇకపోతే విడాకుల గురించి ఛత్రపతి శేఖర్ మాట్లాడుతూ.. “నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం. దేవదాసు కనకాల ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ తీసుకున్నాను. పెళ్లయ్యాకే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఒకానొక సమయంలో మా మధ్య గొడవలు వచ్చాయి. తరచూ గొడవలు జరుగుతూ ఉంటే.. కలిసి ఉండి గొడవ పడడం కంటే.. విడిపోయి దూరంగా ఉండడం మంచిది అనుకున్నాము. అందుకే ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోకుండా విడిపోయాము. అయితే విడిపోవడానికి కారణం నేనే.. చాలా బద్ధకస్తుడిని.. ఏదైనా చెబితే వినను.. ఎవరిని కలవను.. పని దొరికితే డబ్బులు వస్తాయని నా భార్య చెప్పేది. కానీ నేనేమో బద్దకస్తుడిలాగే ప్రవర్తించాను. ఇలా మేము విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
also read:Nara Rohit: ఎమోషనల్ నోట్ పంచుకున్న నారా రోహిత్.. పెళ్లయిన వెంటనే ఏంటి గురూ ఇది!
అయితే అడిగిన వారికి కాదనకుండా నేను డబ్బులు ఇవ్వడమే. నా అతి పెద్ద సమస్య అదే. అయితే చేయి చాచి ఎవరైనా సహాయం అడిగితే.. కాదనకుండా డబ్బులు ఇచ్చేవాడిని. వాళ్ళు తిరిగి ఇచ్చే వాళ్ళు కాదు.. అలా నేను చాలా డబ్బు పోగొట్టుకున్నాను. ఒక రకంగా ఇది కూడా నేను చేసిన తప్పే.. ఇది కూడా మా విడాకులకు కారణం ” అంటూ చెప్పుకొచ్చారు ఇకపోతే చంద్రశేఖర్ – నీల్యా భవానీని పెళ్లి చేసుకున్నారు. ఈయన కూడా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించింది. ప్రస్తుతం నీల్యా పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు.
బిగ్ బాస్ బ్యూటీ, సీరియల్ నటి కీర్తి భట్ తో ఉన్న రిలేషన్ గురించి ఆయన మాట్లాడుతూ..”మనసిచ్చి చూడు సీరియల్ లో కీర్తి భట్ తండ్రిగా నటించాను. ఆక్సిడెంట్ లో తన అమ్మ నాన్న కోల్పోవడంతో తాను నన్ను నాన్న అని పిలవడం మొదలు పెట్టింది. ఇకపోతే కీర్తి నా దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. అది చూసి కీర్తి నాకు ఫోన్ చేసింది. ఎందుకలా నా గురించి నెగెటివ్ గా మాట్లాడారు అని అడిగింది. అందులో తప్పేం లేదు కదా.. ఆ తర్వాత కూడా ఒకటి , రెండు సార్లు ఫోన్ చేసింది. కానీ నాకు ఇవ్వాల్సిన డబ్బు మాత్రం ఆమె ఇవ్వలేదు. ఇక మనసిచ్చి చూడు సీరియల్ లో నేను సంపాదించిన దాని కంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అంటూ తెలిపారు.