BigTV English
Advertisement

Team India: మోడీ సార్… గంభీర్, అగర్కార్ ను మీరైనా తీసేయండి.. టీమ్ ఇండియాను కాపాడండి!

Team India: మోడీ సార్… గంభీర్, అగర్కార్ ను మీరైనా తీసేయండి.. టీమ్ ఇండియాను కాపాడండి!

Team India: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా పేలవ ప్రదర్శనపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వన్డే సిరీస్ లో ఓటమి, రెండవ టి-20లో ఓటమి కారణంగా మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చకు దారి తీస్తున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి-20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కానీ రెండవ టి-20 లో మాత్రం భారత్ కి ఓటమి తప్పలేదు.


Also Read: Shreyas Iyer: శ్రేయాస్ అయ్య‌ర్ డిశ్చార్జ్‌.. ఆస్ప‌త్రి బిల్లు క‌ట్టిన‌ బీసీసీఐ… ఎన్ని కోట్లంటే ?

అయితే ఇక్కడ టీమ్ ఇండియా మేనేజ్మెంట్, ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. టి-20 లలో టాప్ వికెట్ టేకర్ అయిన అర్షదీప్ సింగ్ ని జట్టులోకి తీసుకోకపోవడం అభిమానులలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అర్థం కావడం లేదని మాజీ క్రికెటర్లతోపాటు, క్రీడాభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తరచూ బ్యాటింగ్ ఆర్డర్ ని మార్చడం పట్ల అందరిలోనూ అయోమయం కలుగుతుంది.


గిల్ కోసం యశస్వి జైస్వాల్ కి అన్యాయం:

ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ యశస్వి జైష్వాల్ కి జట్టులో చోటు దక్కడం లేదు. ఆసియా కప్ 2025 లో యశస్వి జైస్వాల్ స్థానంలో గిల్ ని ఎంపిక చేయడమే కాకుండా.. వైస్ కెప్టెన్ బాధ్యతలను కూడా అప్పగించారు. దీంతో జైస్వాల్ ఎంపిక కాకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్, టి-20 సిరీస్ కి కూడా జైష్వాల్ ని ఎంపిక చేయలేదు. జైష్వాల్ ఐపీఎల్ 2025లో 14 మ్యాచ్లలో 43 సగటుతో 159.71 స్ట్రైక్ రేట్ తో 559 పరుగులు చేశాడు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

దీనికి ముందు ఇంగ్లాండ్ తో జరిగిన అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో కూడా జైస్వాల్ 411 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. గిల్ కంటే అద్భుత ఫామ్ లో ఉన్నాడు యశస్వి. కానీ అతడిని పక్కన పెట్టి.. గిల్ కి అవకాశం ఇవ్వడంపై మండిపడుతున్నారు క్రీడాభిమానులు. ఇలా గంభీర్ తీసుకునే నిర్ణయాలతో రోజు అతడిని తిట్టాలంటే కూడా మాకు విసుగ్గా ఉందని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు క్రీడాభిమానులు. రెండవ టి-20 లో హర్షిత్ రానా రెండు ఓవర్లకే 26 పరుగులు ఇచ్చాడని.. అయినప్పటికీ అర్షదీప్ సింగ్ ని కాదని హర్షిత్ రాణాని ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బ్యాటింగ్ ఆర్డర్ లో కన్ఫ్యూజన్:

జట్టులో సంజు శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్ ఇప్పటికీ అర్థం కావడం లేదని అంటున్నారు క్రీడాభిమానులు. తొలి టి-20 లో సూర్యకుమార్ బాగా ఆడలేదా..? నాటౌట్ గా నిలవలేదా..? అయినప్పటికీ రెండవ టి-20లో అతడి స్థానాన్ని మార్చారు. సంజూ ని అతడి స్థానంలో తీసుకువచ్చారు. ఓపెనింగ్ నుండి ఐదవ స్థానం వరకు అతడు ఎప్పుడు బ్యాటింగ్ కి దిగుతాడో తెలియదు. ఇక తిలక్ వర్మ నాలుగవ స్థానంలో బరిలోకి దిగి ఆసియా కప్ ఫైనల్ ని గెలిపించాడు. కానీ ఇప్పుడు అతడిని 5వ స్థానానికి మార్చారు.

Also Read: Jemimah Rodrigues: జెమీమాకు నిర‌స‌న సెగ‌.. టీమిండియా నుంచి తొల‌గించాల‌ని హిందూ సంఘాల డిమాండ్ ?

ఇక రెండవ టి-20లో దూబేని కాదని హర్షిత్ రాణా ని బ్యాటింగ్ కి దించారు. తర్వాతి మ్యాచ్ లో హర్షిత్ రానా మూడవ నెంబర్ లో వచ్చినా ఆశ్చర్యం అవసరం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు క్రీడాభిమానులు. అజిత్ అగర్కర్, గౌతమ్ గంభీర్ తో పోలిస్తే గ్రేక్ చాపెల్ మేలుగా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ ని ఎలిమినేట్ చేసేయాలని ప్రధాని మోదీకి సోషల్ మీడియా వేదికగా విన్నవించుకుంటున్నారు.

Related News

Australia: ఆ ఒక్క త‌ప్పిదం… ఆస్ట్రేలియాకు చుట్టుకున్న ద‌రిద్రం.. ఇక అనుభ‌వించాల్సిందే

Kasturi -Jemimah: జెమిమా రోడ్రిగ్స్ పై న‌టి కస్తూరి సీరియ‌స్‌.. నీకు మెడ మీద త‌ల‌కాయ ఉందా?

Shreyas Iyer: శ్రేయాస్ అయ్య‌ర్ డిశ్చార్జ్‌.. ఆస్ప‌త్రి బిల్లు క‌ట్టిన‌ బీసీసీఐ… ఎన్ని కోట్లంటే ?

Jemimah Rodrigues: జెమీమాకు నిర‌స‌న సెగ‌.. టీమిండియా నుంచి తొల‌గించాల‌ని హిందూ సంఘాల డిమాండ్ ?

IPL 2026: SRH నుంచి అభిషేక్ ఔట్‌..దిక్కు లేనివాడు కానున్న ట్రావిస్ హెడ్ ?

Pak vs SA: రోహిత్ శ‌ర్మ రికార్డు బ‌ద్ద‌లు..టీ20 క్రికెట్ లో రారాజుగా బాబర్ ఆజం చ‌రిత్ర‌, పాక్ గ్రాండ్ విక్ట‌రీ

Pro Kabaddi Final: ప్రో క‌బడ్డీ ఛాంపియ‌న్ గా ద‌బాంగ్ ఢిల్లీ…ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?

Big Stories

×