Yoga Asanas: అందరికీ ఒకేలాంటి శరీరాకృతులు ఉండవు. కొందరు సన్నగా, నాజూగ్గా ఉంటే.. మరికొందరు లావుగా ఉంటూ.. చూడ్డానికి కాస్త షేపౌట్ అయినట్టు కనిపిస్తుంటారు. అలాంటి వారికి ముఖ్యంగా తొడల భాగంలోనే అధికంగా కొవ్వు పేరుకుని ఉంటుంది. దీనికోసం ఇప్పటికే రకరకాల వ్యాయామాలు ట్రై చేసినప్పటికీ.. ఎలాంటి ఫలితమూ ఉండకపోవచ్చు. అలాంటి వారు యోగా ద్వారా తొడల కొవ్వుకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు యోగా నిపుణులు. అది కూడా కేవలం 5 ఆసనాల ద్వారానే. మరి ఆ యోగాసనాలేవో ఇప్పుడు తెలుసుకుందామా..
ఈ ఆసనం తొడల్లోని కొవ్వుని కరిగించడంలో బాగా హెల్ప్ అవుతాయి. దీనినే బటర్‌ఫ్లై పోజ్ అంటారు. మొదటగా కూర్చుని రెండు అరికాళ్లను ఒక చోటకు చేర్చాలి. రెండింటినీ కలిపిన తర్వాత కాస్త పైకి లేపి ఉంచాలి. అప్పుడు రెండింటినీ సీతాకోక రెక్కలు కదిలించినట్టుగా కదిలించాలి. ఇలా కదిలిస్తూ ఉండటం వల్ల తొడల్లోని కొవ్వు వేగంగా కరుగుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఈ బద్ధకోణాసనాన్ని ప్రతిరోజూ సాధన చేస్తే క్రమంగా తొడల్లోని కొవ్వు బర్న్ అవుతుంది.
ఈ ఆసనాన్నే బ్రిడ్జ్ పోజ్ అంటారు. దీని వల్ల తొడల్లో పేరుకున్న కొవ్వు చాలా త్వరగా కరిగిపోతుంది. హిప్ మొత్తాన్ని పైకి ఎత్తి పూర్తిగా కాళ్లతోనే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తొడలపై ఒత్తిడి పడుతుంది. చాలా త్వరగా చెమటలు వచ్చేస్తాయి. ఇలా చెమట ద్వారానే ఎక్కువ మొత్తంలో కొవ్వు బయటకు వెళ్లిపోతుంది. బ్రిడ్జ్ పోజ్ వల్ల కేవలం కొవ్వు కరగడం మాత్రమే కాదు.. తొడల ఆకారంలోనూ మంచి ఫలితాలు వస్తాయి. రక్త సరఫరా మెరుగుపడాలన్నా, ఒత్తిడి తగ్గిపోవాలన్నా, వెన్నెముక సమస్యలు తొలగాలన్నా.. అన్నింటికీ ఈ సేతు బంధాసనం పరిష్కారం చూపుతుంది.
ఆ ఆసనాన్ని బోట్ పోజ్ అంటారు. ఇది తొడల్లోని కొవ్వుని కరిగించడంలో పవర్‌ఫుల్ వ్యాయామం. శరీరం మొత్తం బ్యాలెన్స్ చేయడంతో పాటు కండరాల్లో కదలికలు రావడంలో ఇది సహాయపడుతుంది. చేతులు, భుజాలు స్ట్రెచ్ అవుతాయి. దీనివల్ల ఫుల్‌బాడీ వర్కౌైట్ చేసినట్టవుతుంది. అయితే.. ఎక్కువగా తొడల భాగంపై స్ట్రెస్ పడటం వల్ల ఎక్కువగా ఫ్యాట్ కరిగిపోతుంది. పొత్తి కడుపు కండరాలు కూడా బలంగా మారతాయి. మంచి శరీరాకృతి కావాలనుకుంటే ఈ నావాసన బాగా హెల్ప్ అవుతుంది.
యోగాలలో అత్యంత ముఖ్యమైనది వీరభద్రాసన. ఇది వేయాలంటే.. మొదట రెండు కాళ్లను ఎడంగా ఉంచాలి. ఓ మోకాలిని పూర్తిగా బెండ్ చేయాలి. అంటే.. 90 డిగ్రీల కోణంలో ఉండేలా నిటారుగా ఉంచాలి. తొడలను కూడా స్ట్రెచ్ చేయాలి. ఇలా స్ట్రెచ్ చేసిన తర్వాత కాసేపు అదే భంగిమలో ఉండాలి. ఇలా చేయడం తొడల భాగంలో కదలికలు వస్తాయి. ఈ ఆసనం వేస్తూనే బ్రీథింగ్ ఎక్సర్‌సైజ్ కూడా చేయాలి. ఇప్పుడు ఊపిరి గట్టిగా పీల్చుకుని మళ్లీ వదలాలి. ఇలా రోజూ ఉదయం చేస్తే చాలా త్వరగా ఫ్యాట్ కరిగిపోతుంది.
ఈ ఆసనం వేడయం మరింత సులభం. దీనినే చైర్ పోజ్ అంటారు. తొడల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. శరీరం కూడా ఫిట్‌గా మారుతుంది. కుర్చీ మీద కూర్చున్నట్టుగా అదే భంగిమలో ఉండి, ఈ ఆసనం వేయాలి. మోకాళ్లు, హిప్‌పై స్ట్రెస్ పడుతుంది. ఎక్కువ సేపు ఇలాగే ఉంటే.. బాడీ బ్యాలెన్స్ అవడంతో పాటు కొవ్వు కూడా తగ్గుతుంది. శక్తిని పెంచుకోవడంలో ఈ ఆసనం ఎంతగానో తోడ్పడుతుంది.