Guntur Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నరసరావుపేట మండలం ములకలూరు దగ్గర ఈ యాక్సిడెంట్ సంభవించింది. స్కూటీపై ఇద్దర మహిళలు ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న టిప్పర్ లారీ అతి వేగంతో స్కూటీని ఢీ కొట్టింది. దీంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.. మరో మహిళ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుంది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసుుల ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే బాధితులను హాస్పిటల్ కి తరలించారు. మృతురాలు ఒరిస్పా కి చెందిన నిషా గా తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.