Big Stories

Fertilizers:- కొత్త రకం ఎరువుల తయారీ.. డిమాండ్‌ను అందుకోవడం కోసం…

- Advertisement -

Fertilizers:- వ్యవసాయ రంగాన్ని అభివ‌ృద్ధి చేయడానికి ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు సైతం ప్రయత్నిస్తున్నాయి. టెక్నాలజీ సాయంతో పంటలు ఎలా మెరుగ్గా పండేలా చూసుకోవాలి, చెదలను ఎలా నివారించాలి, తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే మార్గాలేమిటి అనే విషయాలను స్టడీ చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే టెక్నాలజీ ద్వారా ఇందులో ఎన్నో విషయాలను వారు సాధించారు. ఇక తాజాగా వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువులను కూడా కొత్త పద్ధతిలో తయారు చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

జింబాబ్వేలో బొగ్గు సాయంతో ఎరువులను తయారు చేయాలని అక్కడి శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. లోకల్‌గా దొరికే బొగ్గును అమోనియా బేస్డ్ ఎరువులను తయారు చేయడానికి ఉపయోగించాలని వారు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో వ్యవసాయ రంగాన్ని కూడా మెరుగుపరిచే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. బొగ్గును ఎరువుగా మార్చడం కోసం గ్యాసిఫికేషన్ ప్రక్రియను వారు ఉపయోగించనున్నారు. ఇప్పటికే దీనికి కావాల్సిన టెక్నాలజీలను, డిజైన్‌లను వారు సిద్ధం చేసి పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

సౌత్ ఆఫ్రికన్ దేశాల్లో ఎరువుల అవసరం చాలా ఉన్నా కూడా లోకల్ ప్రొడక్షన్ అనేది ఆ డిమాండ్‌లోని 10 శాతాన్ని మాత్రమే తీర్చగలుగుతుంది. మిగిలిన 90 శాతాన్ని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతే కాకుండా దీని కారణంగానే ఎక్స్‌ఛేంజ్ రేటు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అందుకే ఈ కొత్త రకమైన ఎరువుల తయారీ ప్రక్రియతో దేశంలోని ఎరువుల డిమాండ్‌ను అందుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇప్పటికే ఒక ప్రైవేట్ ఎరువుల కంపెనీ బొగ్గు నుండి ఎరువుల తయారీని చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఆ దేశ గణాంకాల ప్రకారం జింబాబ్వే దేశం ఎరువుల కోసం ప్రతీ సంవత్సరం 135 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కూడా ఎరువుల డిమాండ్‌ను కేవలం 60 శాతం వరకే అందుకోగలుగుతుంది. బొగ్గు అనేది న్యూట్రియంట్స్‌తో ఉంటుంది కాబట్టి దీంతో ఎరువులు తయారు చేస్తే పంటలకు మంచిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. త్వరలోనే ఈ ఎరువుల తయారీ పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది.

ఇప్పటికే బొగ్గు ఉత్పత్తి బాగా జరిగే సౌతాఫ్రికా, చైనా వంటి దేశాలు.. దీని సాయంతో ఎరువులను తయారు చేయడం మొదలుపెట్టాయి. దీని ద్వారా గ్యాసిఫికేషన్ పద్ధతి ఇప్పటికే పలు దేశాల్లో సక్సెస్‌ఫుల్ అని తెలుస్తోంది. గ్యాసిఫికేషన్ మాత్రమే కాదు.. గ్రాన్యులేషన్ ప్రక్రియ వల్ల కూడా ఎరువుల తయారీ సాధ్యమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎరువుల తయారీపై జింబాబ్వే పట్టుదల చూసి ఫుడ్ సెక్యూరిటీ విషయాన్ని ఆ దేశం సీరియస్‌గా తీసుకుందని ఇతర దేశాలు ప్రశంసిస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News