Big Stories

Covid Disinfectants:- కోవిడ్ నుండి తప్పించుకోబోయి మరో ప్రమాదంలో ప్రజలు…


Covid Disinfectants:- కోవిడ్ అనే మహమ్మారి ఒక్కసారిగా ప్రపంచమంతా వ్యాపించడం మొదలుపెట్టినప్పుడు అది కలిగించగలిగే నష్టం ఏంటని ఎవరూ ఊహించలేకపోయారు. అయినా ఈ వ్యాప్తిని ఎలా అయినా అరికట్టాలని, ప్రజలను ఆ ప్రాణాంతక వ్యాధి నుండి కాపాడాలని శాస్త్రవేత్తలు, వైద్యులు ఎలర్ట్ అయ్యారు. అందుకే శాస్త్రవేత్తలు ఎన్నో రోజులు కష్టపడి దీనికోసం పలు మందులను తయారు చేశారు. ఇప్పుడు ఆ మందులకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

- Advertisement -

కోవిడ్ అనేది అందరి జీవితాలను పలకరించిన తర్వాత హైజీన్‌గా ఉండడం గురించి అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. దాని ద్వారానే పలు యాంటీమైక్రోబియన్ కెమికల్స్ గురించి చాలామందికి తెలియడం మొదలయ్యింది. ఇలాంటి కెమికల్స్ వినియోగించడం ద్వారా కోవిడ్ నుండి దూరంగా ఉండవచ్చని నమ్మిన కొందరు ప్రజలు.. విచ్చలవిడిగా వీటిని వినియోగించడం మొదలుపెట్టారు. ఇన్నాళ్ల తర్వాత ఈ కెమికల్స్ యొక్క అతివినియోగం ద్వారా కలిగే నష్టాలు ఏమిటో శాస్త్రవేత్తలు తెలుసుకోవడం మొదలుపెట్టారు.

- Advertisement -

ప్యాండెమిక్ తర్వాత క్వాటెర్నరీ అమ్మోనియం కాంపౌండ్స్ (క్యూఏసీ) అనేవి ప్రజలు ఎంతవరకు ఉపయోగిస్తున్నారో రివ్యూ చేశారు శాస్త్రవేత్తల టీమ్. కేవలం ఇంట్లోనే కాదు.. హెల్త్ కేర్ రంగంలో, విద్యారంగంలో, ఆఫీసులలో.. ఇలా చాలా ప్రాంతాల్లో క్యూఏసీ వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని వారు గుర్తించారు. ఇప్పటివరకు ఈ క్యూఏసీలు ఆరోగ్యానికి మంచి చేస్తాయి అన్న ఉద్దేశ్యంతోనే ఉపయోగిస్తున్న ప్రజలు.. దీని వల్ల హానికరమైన ప్రభావం పడుతుందని గుర్తించలేకపోతున్నారు.

క్యూఏసీలతో తయారు చేసిన వైప్స్.. తరచుగా మనం రోజూవారి జీవితాల్లో ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టాం. ముఖ్యంగా పిల్లల స్కూల్ డెస్కులను, హాస్పిటల్‌లోని టేబుల్స్‌ను దీంతో శుభ్రపరచడం ప్రారంభించారు. అయితే ఇన్ఫెక్షన్‌ను తగ్గించడం కోసం ఉపయోగిస్తున్న ఈ వైప్స్.. ఇన్ఫెక్షన్స్‌ను తగ్గించకపోగా.. పలు హానికరమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని శాస్త్రవేత్తలు చేసిన రివ్యూలో తేలింది. అందుకే ఇలాంటి డిస్ఇన్ఫెక్టెంట్ వైప్స్‌తో కంటే మామూలుగా నీరు, సబ్బుతో దేనినైనా శుభ్రం చేయడం మంచిదని వారు రికమెండ్ చేస్తున్నారు.

క్యూఏసీల ద్వారా అస్థమా, డెర్మాటిటీస్, ఇన్ఫ్‌లామేషన్ వంటి వ్యాధులు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. 1950ల్లోనే క్యూఏసీ అనేది ప్రమాదకరమైనదని మెడికల్ ప్రపంచంలో నిరూపణ అయ్యింది. దీని ద్వారా పలు బ్యాక్టీరియా వేగంగా వ్యాపించే అవకాశం ఉందని కూడా తేలింది. మనకు తెలియకుండానే ఒక వ్యాధి నుండి కాపాడుకోవడానికి మరొక వ్యాధికి కారణమయ్యే కెమికల్‌కు మన జీవితాల్లో చోటు ఇస్తున్నామని శాస్త్రవేత్తలు వాపోతున్నారు. దీనికి పరిష్కారం క్యూఏసీలు ఉన్న వస్తువులను ఉపయోగించకపోవడమే అని సూచించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News