iPhone Offer: ఆపిల్ అభిమానులందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 16 ప్లస్ ధర ఊహించని విధంగా పడిపోయింది. సాధారణంగా ఆపిల్ మొబైల్స్‌కి తగ్గింపు అంటే అరుదుగా జరుగుతుంది. కానీ ఈసారి ఏకంగా రూ.25,000 వరకు తగ్గించడంతో టెక్ ప్రపంచం మొత్తానికి ఇది షాకింగ్ ఆఫర్‌గా మారింది.
మొదట మార్కెట్లోకి వచ్చినప్పుడు ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.89,900. కానీ ఇప్పుడు విజయ సేల్‌లో కేవలం రూ.67,900కే లభిస్తోంది. అంతే కాదు… హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే ఇంకో రూ.3,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అంటే మొత్తం రూ.65,000కే ఐఫోన్ 16 ప్లస్ మీ జేబులోకి వస్తుంది. ఈఎంఐ ఆప్షన్లు కూడా నెలకు కేవలం రూ.3,292 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే ఇంకో బెనిఫిట్ కూడా పొందవచ్చు.
ఇక ఫీచర్లలోకి వస్తే ఐఫోన్ 16 ప్లస్‌లో ఉన్న 6.7 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ ఒలీడ్ డిస్‌ప్లే ఆకట్టుకునేలా ఉంది. 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో, ఎండలోనూ క్లారిటీ సూపర్‌గా కనిపిస్తుంది. గేమ్స్ ఆడినా, సినిమాలు చూశినా, సోషల్ మీడియాలో స్క్రోల్ చేసినా ప్రతి అనుభవం ప్రీమియమ్‌గా ఉంటుంది.
Also Read: Hyderabad Rain Today: ముంచెత్తిన మూసీనది.. చాదర్ ఘాట్ వంతెన మూసివేత
పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో ఉన్న A18 చిప్‌సెట్ నిజంగా బీస్ట్ లాంటిది. గేమింగ్, మల్టీటాస్కింగ్, హెవీ యాప్స్ అన్నీ స్పూత్, పవర్ ఫుల్. సాఫ్ట్‌వేర్‌గా తాజా ఐఓఎస్ 18.4 ఉండటంతో సెక్యూరిటీ, కొత్త ఫీచర్లు, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ అన్నీ కలిపి ఒక ఓ రేంజ్‌లో ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
ఇక బ్యాటరీ లైఫ్ చెప్పక తప్పదు. ఐఫోన్ 16 ప్లస్ ఒకసారి చార్జ్ చేస్తే 27 గంటల వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది. ఇది ఆపిల్ ఇప్పటివరకు ఇచ్చిన బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌లలో ఒకటి. నీటిలో పడినా, దుమ్ములో ఉన్నా టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఐపి68 సర్టిఫికేషన్ తో ఈ ఫోన్ సేఫ్.
కెమెరా విషయానికి వస్తే, ఇందులో ఉన్న 48ఎంపి ప్రైమరీ సెన్సార్ ప్లస్ 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ అద్భుతమైన ఫొటోలు, వీడియోలు ఇస్తాయి. నైట్ ఫోటోగ్రఫీ, డే లైట్ షాట్స్ అన్నీ ప్రొఫెషనల్ లుక్‌తో వస్తాయి. అలాగే 12ఎంపి ఫ్రంట్ కెమెరా వల్ల సెల్ఫీలు, వీడియో కాల్స్ హెచ్‌డి క్వాలిటీతో మెరిసిపోతాయి. ఇప్పటి ధర తగ్గింపుతో ఐఫోన్ 16 ప్లస్ నిజంగా ఒక విన్-విన్ డీల్. ఇప్పుడు కేవలం రూ.65,000 ప్రభావవంతమైన ధరలో. ఇప్పుడు కొనే వారికి ఇది నిజంగా గోల్డెన్ ఆప్షన్ అని చెప్పొచ్చు.