Vaibhav bat sponsorship: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఇరగదీసిన సంగతి తెలిసిందే. సిక్సర్లు అలాగే బౌండరీలతో ప్రత్యర్థికి వణుకు పుట్టించాడు. వరల్డ్ క్లాసు బౌలర్లకు కూడా చుక్కలు చూపించాడు వైభవ్ సూర్యవంశీ. ముఖ్యంగా ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ మ్యాచ్ లలో వైభవ్ సూర్యవంశీ వరుసగా 90 కి పైగా పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. కొంచెం లో రెండు సెంచరీలు మిస్ అయ్యాయి కానీ… అతని వీరోజిత పోరాటం మాత్రం హాట్ టాపిక్ అయింది. ఇలాంటి క్రమంలో విరాట్ కోహ్లీకి ఊహించని వైభవ్ సూర్య వంశీ. బ్యాట్ల స్పాన్సర్ షిప్ లో (Vaibhav Suryavanshi Bat Sponsorship ) రికార్డు స్థాయిలో వైభవ్ అందుకునేందుకు సిద్ధమయ్యాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అద్భుతంగా వైభవ్ సూర్యవంశీ ఆడాడు. దీంతో అతని బ్రాండ్ విలువ పెరిగింది. టీమిండియాలోకి కూడా త్వరలోనే రాబోతున్నాడు. ఇలాంటి క్రమంలో ఓ ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది అంట. ఇకపైన వైభవ్ సూర్యవంశీ పట్టే బ్యాట్ స్పాన్సర్ షిప్ కోసం 12 కోట్ల ఆఫర్ చేసిందట. ఏడాదికి 12 కోట్లు ఇచ్చేందుకు సదరు కంపెనీ ముందుకు వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 ముగిసిన నేపథ్యంలో పైన పేర్కొన్న ఓ అంతర్జాతీయ కంపెనీ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక దీనికి వైభవ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ సందర్భంగా ఎస్ఎస్ బ్యాట్ పట్టాడు వైభవ్. ఇది ఏడాదికి 50 లక్షల రూపాయలు మాత్రమే.
అయితే ఈ సీజన్ లో అద్భుతంగా రాణించిన నేపథ్యంలో… అతని బ్యాట్ బ్రాండ్ విలువ 12 కోట్లకు చేరిందన్నమాట. టీమిండియాలో ఇప్పటివరకు హైయెస్ట్ గా బ్యాట్ల స్పాన్సర్షిప్ అందుకుంది విరాట్ కోహ్లీ ఒక్కడే. అతడు వినియోగించే ఎంఆర్ఎఫ్ బ్యాట్ కంపెనీ, ఏడాదికి రూ.12.50 కోట్లు అందిస్తోంది. ఇదే ఇప్పటివరకు అత్యధికం. అయితే ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ… విరాట్ కోహ్లీ దరిదాపుల్లోకి వచ్చాడు. 15 ఏళ్ల వయసులోనే 12 కోట్ల స్పాన్సర్షిప్ అందుకోబోతున్నాడు. అతని హవా ఇలాగే కొనసాగితే విరాట్ కోహ్లీని కూడా బీట్ చేస్తాడని అంటున్నారు. దీంతో విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో దారుణంగా ఆడుకుంటున్నారు నెటిజెన్స్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ఇప్పటివరకు 16 మ్యాచ్ లో ప్రాతినిధ్యం వహించాడు వైభవ్. ఈ నేపథ్యంలో 776 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్థ సెంచరీలతో పాటు ఒక సెంచరీ కూడా ఉంది. రెండుసార్లు సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇతని తర్వాత గిల్ 722 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇవాళ ఫైనల్ ఉన్న నేపథ్యంలో గిల్ అర్థ సెంచరీ చేస్తే… వైభవ్ దాదాపు ఆరెంజ్ క్యాప్ మిస్ చేసుకుంటాడు.