Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. తాను రాణించడమే కాదు, బెంగళూరు జట్టుకు వరుసగా విజయాలు అందిస్తున్నాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli). అయితే అలాంటి విరాట్ కోహ్లీకి ఘోర అవమానం ఎదురయింది. అతడు ఎంతో ఇష్టంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన one 8 కమ్యూన్ ( One8 Commune Bengaluru ) హోటల్ మూసి వేసినట్లు సమాచారం. అద్దె చెల్లింపులో జాప్యం చేసినందుకు గాను సివిల్ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఏర్పాటు చేసుకున్న రెస్టారెంట్ ను మూసివేశారని ప్రచారం జరుగుతోంది. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
2023 సంవత్సరంలో చిన్నస్వామి స్టేడియం దగ్గరే ఈ one 8 కమ్యూన్ ( One8 Commune ) రెస్టారెంట్ ను ఓపెన్ చేశాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత బెంగళూరులోనే పాపులారిటీ సంపాదించుకున్న ఈ హోటల్ కు రోజుకు లక్షల్లో బిజినెస్ అయ్యేది. ఇప్పటికి కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. అయితే ఈ హోటల్ ను ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు. అంటే ప్రతినెల అద్దెతో పాటు మెయింటెనెన్స్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. వీటిని విరాట్ కోహ్లీ బృందం పెండింగ్ లో పెట్టిందట. లక్షల్లో ఈ డబ్బులు రావాల్సి ఉండగా, కోర్టు మెట్లు ఎక్కాడు బిల్డింగ్ ఓనర్. దీంతో బకాయిలు చెల్లించే వరకు హోటల్ మూసివేయాలని.. సివిల్ కోర్టు కీలక ఆదేశాలు దారి చేసింది.
one 8 కమ్యూన్ కేసులో సివిల్ కోర్టు చట్టపరమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ చాలా తెలివిగా వ్యవహరించాడు. బెంగళూరులోని one 8 కమ్యూన్ హోటల్ భాగస్వామ్యం నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ హోటల్ రూల్స్ పదే పదే బ్రేక్ చేస్తున్న నేపథ్యంలో… తన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని కోహ్లీ భయపడిపోయాడు. అందుకే ముందుగానే హోటల్ బాధ్యతలు నుంచి తప్పుకున్నాడట. ఇక ప్రస్తుతం ఈ హోటల్ నిర్వహణ బాధ్యత ఓ ప్రైవేట్ హాస్పిటాలిటీ కంపెనీ చూసుకుంటుందని తెలుస్తోంది.
టీమిండియాలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ… మూడు ఫార్మాట్లకు కెప్టెన్ కూడా అయ్యాడు. అలాగే ఎన్నో విజయాలను కూడా ఒంటి చేత్తో అందించాడు. అయితే అలాంటి విరాట్ కోహ్లీ లండన్ లో తన కుటుంబంతో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. అక్కడే పెద్ద విల్లా కొనుగోలు చేసి… జీవనం కొనసాగిస్తున్నాడు. వన్డేలు ఉంటే తప్ప ఇండియాకు రావడం లేదు. ఐపిఎల్ టోర్నమెంట్ లో కూడా ఇండియాకు వచ్చి వెళ్ళిపోతున్నాడు కోహ్లీ.
🚨VIRAT KOHLI'S RESTAURANT SHUT DOWN DUE TO UNPAID RENT🚨
– Court orders immediate closure over reported ₹2cr+ rent dues & maintenance charges. 🚫
– Multiple compliance notices (fire safety, operating hours) were already in the picture. ⛑️
– One8 Commune disputes the financial… pic.twitter.com/aUPuTkmeiz— Indian Cricket (@IPL2025Auction) April 23, 2026