E-Paper
Advertisement

పాక్ ఇంట్లోకి వెళ్లి వేటాడిన భారత్.. పహల్గామ్ గాయానికి ‘సిందూర్’ ప్రతీకారం!

పాక్ ఇంట్లోకి వెళ్లి వేటాడిన భారత్.. పహల్గామ్ గాయానికి ‘సిందూర్’ ప్రతీకారం!
Advertisement

Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాదవుతోంది. కాలం మారుతున్నా, గాయాలు మానుతున్నా.. ఆ రోజు జరిగిన మారణకాండ సృష్టించిన ప్రకంపనలు మాత్రం ఇంకా భారతీయుల గుండెల్లో సజీవంగానే ఉన్నాయి. ఆ ఉగ్రదాడి కేవలం ఓ ప్రాంతం మీద జరిగిన దాడి కాదు, భారత ఆత్మగౌరవం మీద జరిగిన దాడి.

టూరిస్టులే టార్గెట్‌‌గా దాడి

ఏడాది క్రితం, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా సేదతీరుతున్న పహల్గామ్.. ఒక్కసారిగా తుపాకుల మోతతో దద్దరిల్లింది. పర్యాటకుల స్వర్గధామంగా పిలవబడే ప్రాంతం.. ఉగ్రవాదులు సృష్టించిన రక్తపాతంతో విషాదంలో మునిగిపోయింది. ఏడాది గడిచినా, ఆనాటి జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. టూరిస్టులే టార్గెట్‌గా ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ మారణహోమంలో.. 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరు తీవ్రంగా గాయపడ్డారు.

ఆపరేషన్ సిందూర్‌తో కఠిన దెబ్బ

Advertisement

భద్రతా దళాలు వెంటనే స్పందించి ఎదురుదాడికి దిగడంతో.. పెను ప్రమాదం తప్పినప్పటికీ, జరిగిన ప్రాణనష్టం మాత్రం బాధిత కుటుంబాల్లో తీరని లోటుని, విషాదాన్ని మిగిల్చింది. ఈ ఉగ్రదాడి గురించి తెలిసి.. దేశం మొత్తం కన్నీరుమున్నీరైంది. అమాయక పౌరుల రక్తం చిందించిన ఉగ్రవాద ముఠాలకు గుణపాఠం చెప్పేందుకు.. అప్పుడే భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి, వాటిని నేలమట్టం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత సైన్యం చూపిన ఈ పరాక్రమం ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టించింది.

ఉగ్రవాదంపై భారత్ గట్టి హెచ్చరిక

భారత్‌లో అలజడి సృష్టించడమే లక్ష్యంగా.. ఉగ్రవాదులు పహల్గామ్‌లో పర్యాటకులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనత తర్వాత.. భారతీయుల రక్తం మరిగింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రమూకలను ఉపేక్షించేది లేదనే సంకల్పం ప్రతి పౌరుడిలోనూ వ్యక్తమైంది. హిందువులే లక్ష్యంగా జరిగిన ఈ వికృత దాడిలో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర విమర్శల వచ్చాయి. ఈ విషాద జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రధాని మోడీ స్పందించారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు.

తలవంచమన్న మోడీ హెచ్చరిక

Advertisement

ఉగ్రవాదాన్ని అంతం చేసే సంకల్పంలో భారత్ ఐక్యంగా ఉందన్నారు. ఉగ్రవాద శక్తుల ఎత్తుగడలు భారత్ ముందు సాగవని మోడీ స్పష్టం చేశారు. భారత్ ఉగ్రవాదానికి తలవంచదని, దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పహల్గాం బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కశ్మీర్ ఆర్థిక వ్యవస్థపై గట్టి దెబ్బ

పహల్గామ్ దాడి కేవలం పర్యాటకులపై జరిగిన దాడి మాత్రమే కాదు, కశ్మీర్ ఆర్థిక వ్యవస్థపై జరిగిన దాడి. వేలాది మంది స్థానికులు అక్కడ టూరిజంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గడిచిన ఏడాదిలో జమ్ముకశ్మీర్ పాలన, భద్రతా వ్యవస్థలో కీలక మార్పులు వచ్చాయ్. పహల్గామ్, గుల్మార్గ్ లాంటి పర్యాటక కేంద్రాల్లో నిఘా పెంచారు. అధునాతన డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ జరుగుతోంది. దాడి జరిగిన మొదట్లో పర్యాటకుల సంఖ్య తగ్గినప్పటికీ, ప్రభుత్వం తీసుకున్న భద్రతా చర్యలతో.. మళ్లీ టూరిస్టులు లోయకు తరలివస్తున్నారు. ఉగ్రవాదుల కదలికలను గుర్తించడంలో స్థానిక ప్రజల సహకారాన్ని భద్రతా దళాలు మరింత పొందుతున్నాయి.

కశ్మీర్‌లో ఉగ్రవాద కమాండర్లకు చెక్

ముఖ్యంగా.. భారత ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానంతో ఉగ్రవాదాన్ని అణచివేస్తోంది. గడిచిన కొన్ని నెలల్లోనే.. కశ్మీర్ వ్యాలీలో అనేకమంది కీలక ఉగ్రదవాడ కమాండర్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. సరిహద్దుల గుండా చొరబాట్లను అడ్డుకునేందుకు అత్యాధునిక సెన్సార్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. పాకిస్థాన్ స్పాన్సర్ చేస్తున్న ఉగ్రవాదానికి చెక్ పెట్టేందుకు భారత్ దౌత్యపరంగానే కాదు, సైనిక పరంగానూ వెనకడుగు వేయడం లేదు. ఆపరేషన్ సిందూర్ తర్వాత, సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాల్లో భయం మొదలైంది. భారత్ తన రక్షణ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమని ఈ ఆపరేషన్ చాటిచెప్పింది.

శత్రు భూభాగంలోకి దూసుకెళ్లిన భారత్

ఆపరేషన్ సిందూర్.. కేవలం ఓ సైనిక చర్య మాత్రమే కాదు, నవ భారత ఆత్మవిశ్వాసానికి ప్రతీక. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగినా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినా భారత్ చూస్తూ ఊరుకోదని, అవసరమైతే శత్రువు భూభాగంలోకి వెళ్లి మరీ దెబ్బతీస్తుందని.. ఈ ఆపరేషన్ నిరూపించింది. అప్పుడు భారత సైన్యం చూపిన తెగువ, వ్యూహాత్మక దాడులు.. పాకిస్థాన్‌కు ఇప్పటికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత సమీకరణాలు మారిపోయాయ్.

ఉగ్ర శిబిరాలపై ముందస్తు దాడులు

ఒకప్పుడు భారత్ ఎప్పుడూ ప్రతిస్పందించే ధోరణిలోనే ఉండేది. కానీ, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ ముందస్తు దాడుల వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది. ఉగ్రవాదులు మన సరిహద్దులు దాటకముందే, వారి శిక్షణ శిబిరాలను నేలమట్టం చేయడం ద్వారా భారత్ తన కఠిన వైఖరిని చాటింది. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి ప్రపంచ దేశాలు మద్దతు తెలపడం, పాక్‌ను ఒంటరి చేయడంలో.. భారత్ విజయం సాధించింది.

పాక్ భూభాగంలోకి దూసుకెళ్లిన భారత్

పాక్ భూభాగంలోకి చొచ్చుకొని వెళ్లి మరీ దాడులు చేసిన తీరు పాక్ సైన్యానికి, అక్కడి ప్రభుత్వానికి ఒక బలమైన సందేశాన్ని పంపింది. గతంలో పాక్ సైన్యం కవర్ ఫైరింగ్ ఇస్తూ.. ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేది. ఇప్పుడు భారత ఆర్మీ సరిహద్దుల్లో నిరంతరం నిఘా పెట్టడమే కాకుండా, చిన్న కదలిక వచ్చినా భారీస్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. శాటిలైట్లు, డ్రోన్ల ద్వారా ప్రతి అడుగును గమనిస్తోంది. తాము ఎక్కడ దాక్కున్నా భారత్ కనిపెట్టగలదనే భయం ఉగ్ర సంస్థలను వణికిస్తోంది.

ఆపరేషన్ సిందూర్ ప్రభావం

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్న వేళ, భారత్‌తో పెట్టుకుంటే జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో ఆపరేషన్ సిందూర్ ద్వారా అర్థమైంది. భారత్ ఇప్పుడు హెచ్చరికలకే కాదు, చేతల్లో చూపిస్తుందనే విషయం దాయాది దేశానికి స్పష్టమైంది. అంతర్జాతీయ సంస్థల నిఘా ఓ వైపు, భారత్ దౌత్యపరమైన ఒత్తిడి మరోవైపు పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్. ప్రస్తుతం సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించడంలో పాక్ చూపిస్తున్న శ్రద్ధ వెనుక భారత్ పట్ల ఉన్న భయమే ప్రధాన కారణమని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఉగ్రవాదంపై ప్రజల తిరుగుబాటు

ఒకప్పుడు కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల అరాచకాలు ఎక్కువగా ఉండేవి. కానీ, ఇప్పుడు ఉగ్ర సంస్థల అగ్రనేతలను ఏరివేస్తూ, వారి నెట్‌వర్క్‌ని భారత్ చిన్నాభిన్నం చేసింది. ఉగ్రవాదానికి అందే హవాలా నిధులను కట్టడి చేయడంలోనూ కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. కశ్మీర్ లోయలో అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో, సామాన్య ప్రలు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ భారత్ వైపే నిలబడ్డారు.

పాక్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

ఆపరేషన్ సిందూర్ నేర్పిన గుణపాఠం పాకిస్థాన్‌కు ఓ స్ట్రాంగ్ వార్నింగ్. భారత్ శాంతిని కోరుకుంటుంది, కానీ ఆ శాంతికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తే ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడదని ఈ ఆపరేషన్ నిరూపించింది. సరిహద్దుల్లో నిశ్శబ్దం కనిపిస్తున్నా, అది భారత్ పరాక్రమం పట్ల పాక్ చూపిస్తున్న అప్రకటిత భయమే! భారత రక్షణ వ్యవస్థ ఇప్పుడు కేవలం రక్షక కవచం కాదు. అవసరమైతే విరుచుకుపడే వజ్రాయుధం. ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్‌తో పాటు ప్రపంచానికి కొన్ని కీలకమైన సిగ్నల్స్ పంపింది.

శాంతిని భంగం చేస్తే భూస్థాపితం

శాంతిని కోరుకునే తమ జోలికొస్తే భూస్థాపితం చేస్తామన్నదే ఆపరేషన్ సిందూర్ సారాంశం. అంతేకాదు, సాధారణ పౌరులకు నష్టం కలగకుండా, కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని చేసిన మెరుపు దాడి ఇది. దీంతో.. భారత్ టెక్నాలజీ పవరేంటో ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాల విషయంలో.. ఇకపై అగ్రెసివ్‌‌‌గానే ఉంటామని భారత్ స్పష్టం చేసింది. శత్రువుల కళ్లు గప్పి, వారి గడ్డపైకే వెళ్లి దాడి చేయడం ద్వారా భారత నిఘా సంస్థల బలమేంటో నిరూపితమైంది.

సిందూర్ తర్వాత భారత్ దూకుడు

శాంతి వైపు అడుగులు వేస్తున్న కశ్మీర్‌లో పహల్గాం లాంటి ఘటనలు కొంత అంతరాయం కలిగిస్తున్నప్పటికీ, అభివృద్ధి మాత్రం ఆగడం లేదు. భవిష్యుత్తులో ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా చూడటమే ఇప్పుడు కశ్మీర్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం ముందున్న సవాల్. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ చూపిన తెగువ.. శత్రుదేశాలకు వణుకు పుట్టించింది.

Also Read: బెంగళూరులో దారుణం.. పసికందు గొంతు కోసిన 19 ఏళ్ల కన్నతల్లి!

Story by: Anup, Big Tv

Related News

ఫిఫా ఫైనల్ కురుక్షేత్రం.. 16 ఏళ్ల కల నెరవేరిన వేళ.. కన్నీళ్లతో మెస్సీ వీడ్కోలు!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

Big Stories

Advertisement
×