Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్… భారత క్రికెట్ నియంత్రణ మండలికి కీలక సూచనలు చేశారు. ఆసియా కప్ 2025 టోర్నమెంటులోకి… 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అలాగే సాయి సుదర్శన్ లాంటి ప్లేయర్లను తీసుకోవాలని వెల్లడించారు. తానే ప్రస్తుతం సెలక్షన్ అధికారిగా ఉంటే… ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. అభిషేక్ శర్మాను మొదటి ఛాయిస్ గా తీసుకునే వాడిని అని వెల్లడించారు. ఆ తర్వాత 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ లేదా సాయి సుదర్శన్ ను ఫైనల్ చేసేవాడిని అంటూ కీలక ప్రకటన చేశారు కృష్ణమాచారి శ్రీకాంత్.
Also Read: Rinku Singh: రింకు సింగ్ కు దరిద్రంగా మారిన ఆ లేడీ…టీమిండియాలో ఛాన్స్ దక్కడం కష్టమేనా ?
మంగళవారం మధ్యాహ్నం టీమిండియా జట్టు ప్రకటన
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో మంగళవారం అంటే రేపు టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించబోతోంది. రేపు సెలక్టర్ లందరూ సమావేశం అయి మధ్యాహ్నం 1:30 గంటలకు… టీమిండియా జట్టును ప్రకటిస్తారట. ప్రెస్ నోట్ ద్వారా మాత్రమే టీమిండియా సభ్యులను ప్రకటిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముందుగా ప్రెస్ మీట్ పెట్టి అజిత్ అగర్కర్ సభ్యుల వివరాలను ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ప్రెస్ నోట్ ద్వారానే జట్టును ప్రకటించాలని డిసైడ్ అయ్యారట. దీంతో అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ షెడ్యూల్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే ఫిక్స్ అయింది అన్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. యూఏఈ వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ లు…. సెప్టెంబర్ 28వ తేదీ వరకు కొనసాగుతాయి. సెప్టెంబర్ 14వ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో… టీమిండియా మాజీ క్రికెటర్లు అందరూ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకువస్తున్నారు. ఈ మ్యాచ్ ను టీమ్ ఇండియా ఆడకూడదని కోరుతున్నారు. భారత సైనికులను చంపిన పాకిస్తాన్తో క్రికెట్ ఆడితే మన విలువ పోతుందని.. హర్భజన్ లాంటి క్రికెటర్లు కోరుతున్నారు. మరి దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి రేపు ప్రకటన చేసే ఛాన్సులు ఉన్నాయి.
ఇక రేపు ప్రకటించే జట్టులో టీమిండియా కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ఉంటాడని తెలుస్తోంది. ఓపెనర్ గా అభిషేక్ శర్మ అలాగే సంజు ఇద్దరూ ఇప్పటికే ఫైనల్ అయినట్లు చెబుతున్నారు. అయితే గిల్ ఆడితే… తెలుగు కుర్రాడు తిలక్ వర్మపై వేటు పడే ప్రమాదం పొంచి ఉందని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టి20 ర్యాంకింగ్స్ ప్రకారం తిలక్ వర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. కాబట్టి అతన్ని తొలగించే ఛాన్స్ ఉండదని అంటున్నారు.
Also Read: Asia Cup 2025: ఖతం, టాటా, బై బై… రిజ్వాన్, బాబర్ లేకుండానే పాకిస్తాన్ జట్టు ప్రకటన..!