Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ వచ్చే నెల ప్రారంభం కానున్న నేపథ్యంలో… పాకిస్తాన్ జట్టుకు వెన్నులో వణుకు పుట్టించేందుకు భారత ఆర్మీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇండియన్ ఆర్మీ అధికారి క్రికెట్ ఆడుతూ… పాకిస్తాన్ జట్టుకు డేంజర్ బెల్స్ పంపించాడు. అత్యంత ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తూ ఈ వీడియోలో కనిపించాడు ఆ ఇండియన్ ఆర్మీ అధికారి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Asia Cup 2025: ఖతం, టాటా, బై బై… రిజ్వాన్, బాబర్ లేకుండానే పాకిస్తాన్ జట్టు ప్రకటన..!
క్రికెట్ ఆడుతున్న ఇండియన్ ఆర్మీ అధికారి
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కు టీమిండియా కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో…. జమ్మూ కాశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ అధికారి క్రికెట్ ఆడుతూ కనిపించాడు. జమ్మూ కాశ్మీర్ లోని షోపియన్ జిల్లాలో ఉన్న పొలాలలో స్థానికులతో క్రికెట్ ఆడాడు ఈ ఇండియన్ ఆర్మీ అధికారి. ఇండియన్ ఆర్మీ విభాగంలో… అత్యున్నత స్థానంలో ఇతను పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాసేపు సరదాగా గడుపుదామన్న నేపథ్యంలో… క్రికెట్ ఆడినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఇండియన్ ఆర్మీ అధికారి క్రికెట్ ఆడిన వీడియో వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇక ఇండియన్ ఆర్మీ క్రికెట్ ఆడుతున్న వీడియోను చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ అధికారి.. పాకిస్తాన్ తో మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాడని.. కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా జట్టులో ఈ ఇండియన్ ఆర్మీ అధికారిని కూడా చేర్చండి అని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
టీమిడియా వర్సెస్ పాకిస్తాన్ ( Ind Vs Pak ) మధ్య మ్యాచ్ ఎప్పుడు అంటే
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025) సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు దాదాపు 19 మ్యాచ్ లు ఈ టోర్నమెంట్ లో భాగంగా జరగనున్నాయి. అయితే సెప్టెంబర్ 14వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇది ఇలా ఉండగా.. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కోసం ఆడే జట్టును.. భారత క్రికెట్ నియంత్రణ మండలి రేపు ప్రకటించనుంది. రేపు అంటే మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో టీమిండియా జట్టును ప్రకటించనునట్లు తెలుస్తోంది. ప్రెస్ నోట్ ద్వారా టీమిండియా జట్టును ప్రకటించబోతున్నారట. ఇక రేపే మహిళల వరల్డ్ కప్ ఆడే జట్టును కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Rinku Singh: రింకు సింగ్ కు దరిద్రంగా మారిన ఆ లేడీ…టీమిండియాలో ఛాన్స్ దక్కడం కష్టమేనా ?
A viral video showcasing an #IndianArmy officer playing cricket in the fields of #Shopian district in #JammuAndKashmir with the locals has gone viral on social media. @TheSkandar @JavedBeigh @SrinagarGirl @sanjayraina @RamblingBrook @AartiTikoo @gauravcsawant @IamTheStory__ pic.twitter.com/gSx9nrBwEU
— Seher Mirza (@SeherMirzaK) August 18, 2025
?igsh=MXFrdmFhaGVoZWYybA%3D%3D