Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 ) అతి త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్తాన్ తమ జట్టును ప్రకటించేసింది. టీమిండియా ప్రకటించే కంటే ముందే పాకిస్తాన్ తమ జట్టును… రివిల్ చేసేసింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. మొత్తం 17 మందితో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించింది. ఇందులో పాకిస్తాన్ మాజీ కెప్టెన్లు ఇద్దరు లేరు. బాబర్ అజాం, మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరు స్టార్ ప్లేయర్లను కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దూరం పెట్టింది. వాళ్లను లెక్కలోకి తీసుకోలేదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అంతేకాదు సల్మాన్ అలీ అఘా కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.
Also Read: Praggnanandhaa : నుదిట విభూది పెట్టుకోవడం వెనుక రహస్యం ఇదే.. చెస్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్
బాబర్, రిజ్వాన్ ఇద్దరు ఆటగాళ్లకు షాక్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో బాబర్ అలాగే రిజ్వాన్ లాంటి స్టార్ ప్లేయర్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దూరం పెట్టింది. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు ప్లేయర్లు పెద్దగా రాణించడం లేదు. చాలాసార్లు ఛాన్స్ ఇచ్చినప్పటికీ ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో మొన్నటి వరకు కెప్టెన్ గా ఉన్న బాబర్ పై వేటు వేసి రిజ్వాన్ కు కూడా కెప్టెన్సీ అప్పగించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయినప్పటికీ పరిస్థితి మార్చుకోలేదు. ఫలితంగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో బాబర్ అలాగే రిజ్వాన్లపై వేటు వేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడు అంటే?
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో తటస్థ వేదికల పైన ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఒక మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 14వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొన్న యుద్ధం జరిగిన నేపథ్యంలో చాలా మంది సైనికులు అలాగే సామాన్య పౌరులు మరణించారు. అందుకే పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకుండా టీం ఇండియా నిర్ణయం తీసుకోవాలని చాలామంది మాజీ క్రికెటర్లు, హర్భజన్ లాంటివారు డిమాండ్ చేస్తున్నారు.
ఆసియా కప్ కోసం పాకిస్థాన్ స్క్వాడ్ : సల్మాన్ అలీ (c), అబ్రార్, ఫహీమ్, ఫఖర్, రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, తలత్, ఖుష్దిల్ షా, హరీస్ (WK), నవాజ్, వసీమ్ జూనియర్, ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్, సుఫ్యాన్ మొకిమ్.
Also Read: Neeraj Chopra’s wife : నీరజ్ చోప్రా భార్యకు పట్టిన దరిద్రం.. 1.5 కోట్ల జాబ్, సర్వం కోల్పోయిందిగా!
Babar Azam and Mohammad Rizwan miss out as Pakistan name their 17-member squad for the Asia Cup.#AsiaCup2025 #AsiaCup #Pakistan pic.twitter.com/qvlTuQ1Hq0
— Circle of Cricket (@circleofcricket) August 17, 2025