Rinku Singh: టీమిండియా బెస్ట్ ఫినిషర్ రింకు సింగ్ ( Rinku Singh ) పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారయింది. అతనికి టీమిండియాలో ఛాన్స్ దక్కే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా రింకు సింగ్ పెద్దగా రాణించడం లేదు. అతని ఆట తీరు సరిగ్గా లేకపోవడంతో ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో… రింకు సింగ్ ను తీసుకోవడం కష్టమేనని… సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే టీమిండియాలో ( Team India) రింకు సింగ్ కు అవకాశాలు రాకపోవడంపై… ఆయనకు కాబోయే భార్య ప్రియా సరోజ్ ( Priya Saroj ) అంటూ సోషల్ మీడియాలో.. వార్తలు వైరల్ చేస్తున్నారు. ఆమె దరిద్రం రింకు సింగ్ కు పట్టిందని.. అందుకే సరిగ్గా అతడు ఆడడం లేదని దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
Also Read: Neeraj Chopra’s wife : నీరజ్ చోప్రా భార్యకు పట్టిన దరిద్రం.. 1.5 కోట్ల జాబ్, సర్వం కోల్పోయిందిగా!
అత్యంత దారుణంగా రింకు సింగ్ ప్రదర్శన
గత సంవత్సరం అంటే 2024 t20 వరల్డ్ కప్ ( 2024 T20 World Cup ) సమయంలో టీమిండియా డేంజర్ ఆటగాడు రింకు సింగ్ అత్యంత దారుణంగా ప్రదర్శన కనబరిచాడు. టీమిండియాను గెలిపిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న.. రింకు సింగ్ అందరికీ షాక్ ఇచ్చాడు. 2024 t20 ప్రపంచ కప్ లో మొత్తం 13 మ్యాచులు ఆడాడు రింకు సింగ్. ఇందులో కేవలం 190 పరుగులు మాత్రమే చేయగలిగాడు. యావరేజ్ 21.11 శాతం గానే నమోదయింది. ఇక స్ట్రైక్ రేట్ 138.68 గా ఉంది. టి20 లకు ఈ స్ట్రైక్ రేట్ ఏమాత్రం సరిపోదు. మినిమం 200కు పైగా స్ట్రైక్ రేట్ ఉంటేనే టి20 లకు పనికి వస్తారు. అంతకుముందు రింకు సింగ్ ది స్ట్రైక్ రేట్ 200 కు పైగానే ఉండేది. కానీ క్రమక్రమంగా తన స్ట్రైక్ రేట్… కోల్పోయాడు రింకు సింగ్. కేవలం టి20 లోనే ఆడుతున్న రింకు సింగ్… అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో కూడా పెద్దగా రాణించడం లేదు. 2024 ఐపీఎల్ టోర్నమెంట్ సమయంలో బాగానే ఆడిన రింకు సింగ్ 2025 టోర్నమెంట్ వచ్చేసరికి అత్యంత చిత్త ప్రదర్శన కనబరిచాడు.
ప్రియా సరోజ్ తో ఎంగేజ్మెంట్ కొంపముంచిందా ?
ఇటీవల కాలంలోనే టీమిండియంగా ఆటగాడు రింకు సింగ్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యురాలు ప్రియా సరోజ్ తో టీమిండియా డైనమిక్ ఆటగాడు రింకు సింగ్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది. ఈ ఇద్దరి వివాహం డిసెంబర్లో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఎంగేజ్మెంట్ జరిగిన నేపథ్యంలో.. రింకు సింగ్ కు దరిద్రం పట్టిందని అంటున్నారు. తన భార్య దరిద్రం ఇతనికి పట్టడం వల్ల సరిగ్గా ఆడడం లేదని సెటైర్లు పేల్చుతున్నారు. అందుకే ఇప్పుడు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో కూడా అతనికి అవకాశం దకడం కష్టమే అంటున్నారు.
Also Read: Praggnanandhaa : నుదిట విభూది పెట్టుకోవడం వెనుక రహస్యం ఇదే.. చెస్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్