Tilak Varma : ఆసియా 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 29న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆసియాకప్ నకు పాకిస్తాప్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. రేపు టీమిండియా జట్టును కూడా బీసీసీఐ ప్రకటించబోతుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. భారత టెస్ట్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ కోసం తిలక్ వర్మ రెండో స్థానంలో బ్యాటింగ్ కి రానున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఏంట్రా ఈ రాజకీయాలు అంటూ గౌతమ్ గంభీర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
Also Read : Asia Cup 2025: దరిద్రం అంటే ఇదే.. ఆసియా కప్ 2025 లో ఈ తోపు క్రికెటర్లను మిస్ కాబోతున్నాం
తిలక్ వర్మ కి అన్యాయం..?
టీమిండియా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నారు. అయితే వైస్ కెప్టెన్ గా శుబ్ మన్ గిల్ కి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక క్రమక్రమంగా కెప్టెన్సీ ని కూడా శుబ్ మన్ గిల్ కే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే వన్డేలకు కూడా గిల్ కెప్టెన్ కచ్చితంగా అవుతాడని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక భారత జట్టుకు అన్ని ఫార్మాట్లకు ఒక్కరినే కెప్టెన్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ అవకాశం గిల్ కి రానుంది. అయితే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో టీమిండియా జట్టులోకి గిల్ వస్లే.. తిలక్ వర్మ తప్పుకోవాల్సి వస్తుందని మరికొందరూ పేర్కొనడం గమనార్హం. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మూడో స్థానంలో అద్భుతంగా రాణిస్తాడు. గిల్ రంగంలోకి దిగితే తిలక్ వర్మను సెలక్ట్ చేయకపోవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే గిల్ కారణంగా అద్భుత క్రికెటర్ తిలక్ వర్మకి అన్యాయం జరుగుతుందనే చెప్పవచ్చు. దీనిపై తెలుగు అభిమానులు బీసీసీఐ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సూర్యకుమార్ కెప్టెన్సీలో..
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత బ్యాటింగ్ లైనఫ్ బాగుంటుంది. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ లైనఫ్ లో తిలక్ వర్మ, రింకూసింగ్ అద్భుతంగా రాణిస్తారు. వికెట్ కీపింగ్ గా జితేష్ శర్మ బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంజు శాంసన్ ఈ మధ్య పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న తరుణంలో అతను సెలక్ట్ అవుతాడా..? లేదా అనేది కాస్త డౌట్ గానే అనిపిస్తోంది. 2026 టీ-20 ప్రపంచ కప్ కి సిద్ధం అవుతుండటంతో ఇప్పటి నుంచే యువ క్రికెటర్లకు అవకాశం కల్పిస్తే.. టైటిల్ సాధించవచ్చు. మరోవైపు భారత్ వర్సెస్ పాక్ ఆసియా కప్ క్లాష్ అంతిమ పరీక్ష అవుతోంది. ఆసియా కప్ ఈసారి ఇండియా-శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కప్ ను ఎలాగైనా గెలవాలని టీమిండియా భావిస్తోంది. కానీ ఆసియా కప్ లో ఏ జట్టు ఫైనల్ గా విజయం సాధిస్తుందో వేచి చూడాలి మరీ.