Naga Vamsi: కొన్ని సందర్భాలలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా 10 మందిలో మాట్లాడుతున్నప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత నాగ వంశీకి తన మాటల శాపంగా మారాయి. కొన్ని సందర్భాలలో నాగ వంశీ మాట్లాడిన మాటలు ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. నాగ వంశీ నిర్మించిన సినిమా ఫెయిల్ అయింది అంటే, ముందు నాగ వంశీ ట్రోల్ కి గురవుతాడు.
సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమా గురించి భారీ హైప్ ఇవ్వడం అనేది ఎప్పటినుంచో నాగ వంశీకి అలవాటు. ఆ హైప్ తో థియేటర్ కి వెళ్లిన ఆడియన్ చాలా సందర్భాల్లో డిసప్పాయింట్ అవుతాడు. తన డిసప్పాయింట్మెంట్ కి కారణమైన నాగ వంశీ ట్రోల్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా వార్ 2 సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ చేశాడు వంశీ. ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. ముఖ్యంగా చాలామంది డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా నిరాశను మిగిల్చింది.
నిద్ర పడుతుందా.?
నాగ వంశీ తన బ్యానర్లో అద్భుతమైన సినిమాలు కూడా నిర్మించాడు. జెర్సీ, సార్, లక్కీ భాస్కర్ వంటి సినిమాలు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గౌరవాన్ని నిలబెట్టాయి. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కావడం వలన చాలామంది నిర్మాతలతో కలిసి అప్పట్లో అనుపమ చోప్రా ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి వచ్చిన పుష్ప సినిమా నార్త్ లో ఒక సండే 80 కోట్లు వసూలు చేసింది అంటే నాకు తెలిసి కంప్లీట్ గా ముంబై కూడా నిద్రపోయి ఉండదు అని ఆ ఇంటర్వ్యూలో అన్నాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. హిందీ సినిమా నుండి వచ్చిన వార్ 2 సినిమాకు ప్రస్తుతం కలెక్షన్లు రావడం లేదు నీకు నిద్ర పడుతుందా అన్న అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.
వంశీ సైలెంట్
వార్ 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత, వంశీ కంప్లీట్ గా సైలెంట్ అయిపోయారు. మామూలుగా అయితే తన సినిమా విషయంలో ఏం జరిగినా డిఫెండ్ చేస్తుంటారు. కానీ వార్ 2 సినిమా విషయానికి వస్తే, జెన్యూన్ రిజల్ట్ నాగ వంశీ కూడా అర్థమయిపోయింది. భారీ రేటు పెట్టి కొన్న ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం తన బ్యానర్లో మాస్ జాతర సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నా కూడా మీడియా ముందు వంశీ కనిపించడం లేదు. మామూలుగా తన సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది అంటే కొన్ని రోజులు ముందు నుంచి ఇంటర్వ్యూలో హడావిడిగా కనిపిస్తుంటాడు. మరోవైపు ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది అని వార్తలు కూడా వస్తున్నాయి. దీని గురించి ఇంకా అధికారికి ప్రకటన రాలేదు.
Also Read: Cm Revanth Reddy: నేషనల్ అవార్డు విన్నర్లకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు