War 2 – Ntr: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక టాపిక్ మీద చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్ వార్స్ విపరీతంగా జరుగుతాయి. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి (megastar Chiranjeevi) , బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరిగేవి. కానీ ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు నిత్యం ట్విట్టర్ లో గొడవ పడుతూనే ఉంటారు.
ఆచార్య సినిమా ఫెయిల్ అయినప్పుడు చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ను టార్గెట్ చేశారు. ఆ తర్వాత గేమ్ చేంజర్ (Game Changer) సినిమా వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. ఇక ప్రస్తుతం వార్ 2 సినిమా రిజల్ట్ తేలిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ అంతా కూడా డ్యూటీ ఎక్కారు. ఎన్టీఆర్ (Ntr) ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.గత కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ కి అసలు డిజాస్టర్ సినిమాలు లేవు. ప్రస్తుతం వార్ 2 డిజాస్టర్ అనేది ఊహించని పరిణామం.
ఎన్టీఆర్ కు ఘోర అవమానం
ఇకపోతే వార్ 2 లో ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ నటించిన. హైదరాబాద్ లో వాడు సినిమా ఈవెంట్ కూడా హృతిక్ రోషన్ హాజరై అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడిన మాటలు అభిమానుల్లో జోష్ నింపాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ను ఇన్స్టాగ్రామ్ లో హృతిక్ రోషన్ అన్ఫాలో కొట్టారు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఇది ఘోర అవమానం అంటూ యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ మొదలుపెట్టారు. గతంలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ను ఫాలో అయ్యాడో లేదో కూడా క్లారిటీ లేదు. ఎన్టీఆర్ అయితే మాత్రం ఎవరిని ఫాలో అవ్వరు.
మళ్లీ సైడ్ క్యారెక్టర్
ఇప్పటికీ చాలామందికి త్రిబుల్ ఆర్ సినిమా గురించి డిబేట్ జరుగుతూనే ఉంటుంది. ఆ సినిమా అసలు రామ్ చరణ్ సినిమా అని, ఎన్టీఆర్ కేవలం సైడ్ క్యారెక్టర్ మాత్రమే అంటూ కొంతమంది ఇప్పటికీ ట్రోల్ చేస్తారు. అంతేకాకుండా విజయేంద్ర ప్రసాద్ కూడా ఒక ఇంటర్వ్యూలో చరణ్ గురించి ఎక్కువ మాట్లాడటం వలన ఆ ట్రోలింగ్ ఇంకాస్త ఎక్కువైపోయింది.
ఇప్పుడు కూడా మళ్లీ అదే టాపిక్ ప్రస్తావన లోకి వచ్చింది. వార్ 2 సినిమాలు ఎన్టీఆర్ ది సైడ్ క్యారెక్టర్ అంటూ ఇప్పటికీ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ భారీ లైనప్ సెట్ చేశాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల దర్శకత్వంలో దేవర 2 రానుంది.
Also Read: Rajinikanth: ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు? రజనీ ను చూసి నేర్చుకోండి – సజ్జనర్