E-Paper
Advertisement

బాబ‌ర్ ఆజం వికెట్ పై వివాదం..ఆస్ట్రేలియా C టీమ్ చేతిలో పాకిస్తాన్ ఓట‌మి

బాబ‌ర్ ఆజం వికెట్ పై వివాదం..ఆస్ట్రేలియా C టీమ్ చేతిలో పాకిస్తాన్ ఓట‌మి
Advertisement

Babar Azam Wicket Controversy:  ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ (Pakistan vs Australia) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతోంది. మొన్నటి వరకు ఐపీఎల్ ఆడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు నేరుగా పాకిస్తాన్ వెళ్లి, ఈ వన్డే సిరీస్ లో పాల్గొంటున్నారు. కీలక ప్లేయర్లు ఎవరు వెళ్లలేదు కానీ, ఆస్ట్రేలియా C టీమ్ పాకిస్తాన్ తో తలపడుతోంది. ఈ నేపథ్యంలోనే మొదటి వన్డే మ్యాచ్ లో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. నిన్న జరిగిన రెండవ వన్డేలో మాత్రం ఆస్ట్రేలియా విక్టరీ కొట్టింది.

Also Read: Short Circuit, Smoke In Team Bus:  గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు ! 

బాబర్ ఆజం వికెట్ పై దుమారం

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Pakistan vs Australia, 2nd ODI) మధ్య నిన్న లాహోర్ లోని గడాఫీ స్టేడియం (Gaddafi Stadium, Lahore) వేదికగా రెండవ వన్డే జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ డేంజర్ ఆటగాడు బాబర్ ఆజం (Babar Azam ), ఫస్ట్ డౌన్ లో దిగి 16 పరుగుల వద్ద LBW అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ ఎల్లిస్ వేసిన అదిరిపోయే ఇన్ స్వింగర్ దెబ్బకు బాబర్ ఔట్ అయ్యాడు. అయితే ఫీల్డ్ అంపైర్ మొదటగా అవుట్ ఇవ్వడంతో… బాబర్ రివ్యూ తీసుకున్నాడు. అయితే, రిప్లై లో బంతి పిచ్ ఔట్ సైడ్ పడినప్పటికీ, వికెట్లకు తగిలింది. వాస్తవంగా దీన్ని నాట్ అవుట్ గా ప్రకటిస్తారు. కానీ అంపైర్ కాల్ కింద బాబర్ ఆజం ఔట్ ( Babar Azam Wicket Controversy) అయ్యాడు. ఇక దీనిపై దుమారం రాజుకుంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఈ అంశంపై సీరియస్ అవుతున్నారు. అంపైర్ నిద్రపోయాడని… అందువల్లే బాబర్ ఆజం ఔట్ అయ్యాడని సీరియస్ అవుతున్నారు. దీనివల్ల పాకిస్తాన్ రెండో వన్డేలో ఓడిపోవలసి వచ్చిందని ఆగ్రహిస్తున్నారు.

41 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓటమి

రెండో వన్డేలో ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 50 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 231 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. 44 ఓవర్లు ఫినిష్ అయ్యేసరికి ఆల్ అవుట్ అయింది పాకిస్తాన్. ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ రౌండర్ గా పేరుగాంచిన షాబాద్ ఖాన్ వరుసగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. కానీ నిన్నటి వన్డేలో మాత్రం వికెట్లు తీయలేదు కానీ బ్యాటింగ్ అదరగొట్టాడు. పాకిస్తాన్ జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. 104 బంతుల‌ను ఎదుర్కొన్న షాబాద్ ఖాన్ ( Shadab Khan) , 71 పరుగులతో రాణించాడు. కానీ మిగతా ప్లేయర్లు విఫలమైన నేపథ్యంలో.. పాకిస్తాన్ ఓటమిపాలైంది.

Advertisement

Also Read:  Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు Inzamam-ul-Haq !

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×