Intinti Ramayanam Today Episode june 3rd : పల్లవి తన తల్లి ఇంటికి వెళ్లి ఫోటో దగ్గర దీపం పెడుతుంది.. అయితే భానుమతి తన కూతురు లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. పల్లవి తన తల్లి లేదు అని బాధ పడిపోతూ దీపం పెట్టడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తారు.. అప్పుడు ఇంట్లోకి చక్రధర్ తన ఫ్రెండ్ తో రావడం చూసిన పల్లవి ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు అని చక్రధాన్ని దారుణంగా అవమానించి బయటకు పంపిస్తుంది. భానుమతి ఎంత చెప్తున్నా సరే వినకుండా పల్లవి చక్రధరిని బయటికి పంపించేస్తుంది.. తన భార్య లేదు అని కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అవుతాడు చక్రధర్.. భానుమతి వచ్చి నా కూతురు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఇలా చేసింది ఇప్పుడు తన కూతురు కూడా అలానే చేస్తుంది మీరేం బాధపడకండి అల్లుడుగారు అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. అటు పార్వతి వాళ్లు కూడా రాజేశ్వరి చనిపోయిందని బాధపడిపోతూ ఉంటారు..
రాజేశ్వరి చనిపోయిన ఇంట్లోనే వాళ్ళందరూ బాధపడిపోతూ ఉంటారు. పార్వతి ఆయనకు చెల్లెలు అంటే ప్రాణం.. అయితే గృహలోకి వచ్చిన తర్వాత నా చెల్లెలు ఎక్కడ అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి. మళ్ళీ ఆయన కోమాలోకి వెళ్ళిపోతారేమో అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడే ఉంటే పల్లవి చాలా బాధపడిపోతూ ఉంటుంది.. అయితే పల్లవిని ఇక్కడికి తీసుకొని వస్తే ఆ బాధ నుంచి కాస్త బయటపడుతుంది అని అవని అంటుంది.. బర్త్డే ఫంక్షన్ కాబట్టే అందరిని రమ్మన్నాను అందుకే ఇలా జరిగింది కదా అమ్మ అని ఆరాధ్య బాధపడుతుంది. పల్లవిని నేను తీసుకొని వస్తాను అని అవని అక్కడికి వెళుతుంది.
పల్లవి తన తల్లిని తలుచుకొని బాధపడిపోతూ ఉంటుంది. నాకు నా తల్లిని దూరం చేసిన ఆ అవని అస్సలు వదిలిపెట్టను అని అనుకుంటుంది. అవని నాకు ఇప్పటివరకు ఎన్నో చేసింది. నా కన్నతల్లిని నాకు దూరం చేసింది అంటే నేను తట్టుకోలేక పోతున్నాను. నీ చావుకి కారణమైన ఆ అవనిని అస్సలు వదిలిపెట్టను దాని అంత చూస్తాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది పల్లవి. అవని పై పోలీసులకు కంప్లైంట్ కూడా ఇస్తుంది. దాన్ని ఇంకా బయటికి రానివ్వను అని పల్లవి అంటుంది.. ఆ మాట వినగానే భానుమతి షాక్ అవుతుంది.
పల్లవి కన్నీళ్లు పెట్టుకోవడం చూసిన భరత్ తల్లి లాగా చూసుకుని నాకే బాధగా ఉంది. కన్న తల్లిని పోగొట్టుకున్న నువ్వు ఎంత బాధ పడుతుంటావో కదా సిస్టర్ బాధపడకండి సిస్టర్ మేమంతా నీకోసం ఉన్నాము అని భరత్ అంటాడు. కానీ భరత్ ని ముట్టుకొని ఇవ్వకుండా మీ అక్క వల్లే కదా మా మాం చనిపోయింది అని గట్టిగా కేకలు వేస్తుంది పల్లవి. మీ అక్క వల్లే మా మామ్ చనిపోయింది కాబట్టి ఆ బాధ ఏంటో తనకి కూడా నేను చూపిస్తాను తన తల్లి కూడా దూరం అయ్యేలా చేస్తాను అని అంటుంది. ఆ మాట వినగానే భరత్ షాక్ అవుతాడు.. పల్లవి కోపాన్ని చూసి భరత్ దూరంగా వెళ్ళిపోతాడు..
పల్లవి కోసమని రాజేశ్వర్ ఇంటికి వెళ్లిన అవని బయట చక్రధర కూర్చొని ఉండటం చూసి ఏమైంది నాన్న ఎక్కడున్నారు అని అడుగుతుంది.. పల్లవి నన్ను ఇంట్లోకి రానివ్వడం లేదమ్మా అని చక్రధర్ బాధపడిపోతూ ఉంటాడు.. అయితే పల్లవి లోపలికి రానివ్వడం లేదు అని అనగానే నేను వెళ్లి పల్లవిని మళ్ళీ మన ఇంటికి తీసుకొని వస్తాను నాన్న అని అవని లోపలికి వెళ్తుంది. మీ అమ్మ చనిపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అది అలా జరిగింది అని పల్లవి తో అనగానే ఒక్కసారిగా కోపంతో రెచ్చిపోతుంది పల్లవి. అవని ముట్టుకో పోతుంటే తోసేస్తుంది. నా తల్లిని చంపావు కాబట్టి నీ తల్లిని కూడా చంపుతాను అని వార్నింగ్ ఇస్తుంది. నా దగ్గర నుంచి వెళ్ళిపో అని పల్లవి అనగానే అవని అక్కడి నుంచి వచ్చేస్తుంది.
అవని వెళ్ళింది కదా పల్లవిని ఇంకా తీసుకురాలేదేంటి అని అందరూ ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంట్లోకి సడన్గా పోలీసుల రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. పోలీసులు వచ్చారేంటి అని అందరూ లేచి చూస్తే వాళ్ళు అవని కోసం వచ్చామని అనగానే మా ఆవిడ ఏం చేసింది అని అక్షయ్ అడుగుతాడు. పల్లవి వాళ్ళ అమ్మని చంపేసింది అని తను అవనిపై పోలీస్ కేసు పెట్టింది. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. ముందు అవని ఎక్కడుందో చెప్పండి అని అనగానే అవని పల్లవి ఇంటికి వెళ్లిందండి వస్తూ ఉంటుంది అని పోలీసులకు చెప్తారు. చక్రధర్ కి అవినీకి అక్షయ్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు. ఇక అవని చక్రవర్ ఇంటికి రాగానే పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…