E-Paper
Advertisement

Badrinath: టీమిండియాకు ఓవ‌ర్ కాన్ఫిడెంట్..గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ ప‌క్కా!

Badrinath: టీమిండియాకు ఓవ‌ర్ కాన్ఫిడెంట్..గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ ప‌క్కా!
Advertisement

Badrinath:  టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో ఇండియా పరిస్థితి దారుణంగా తయారైంది. టీమిండియాలో గాయాలు వెంటాడుతున్నాయి. అలాగే బుమ్రా, అభిషేక్ శర్మ లాంటి వాళ్లకు వైరల్ ఫీవర్ సోకింది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియన్ ఉద్దేశించి మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ( Subramaniam Badrinath) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తోందని ఫైర్ అయ్యారు. దీని వల్లే మొన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుపైన ( USA Team) ఓడిపోయే పరిస్థితి నెలకొందని సీరియస్ అయ్యారు బద్రీనాథ్. దీంతో సుబ్రమణ్యం బద్రీనాథ్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Bhanuka LibraryRajapaksa: ఇండియ‌న్‌ బ్యాట్ల‌లో రబ్బ‌ర్లు, అందుకే భ‌యంక‌రంగా ఆడుతున్నారు..విషం క‌క్కిన శ్రీలంక ప్లేయ‌ర్‌

టీమిండియాకు ఓవ‌ర్ కాన్ఫిడెంట్..గ్రూప్ స్టేజ్ లోనే ఎలిమినేట్ ప‌క్కా!

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్ల మధ్య ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా పడుతూ లేస్తూ ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కేవలం 29 పరుగులు తేడాతో విక్టరీ కొట్టింది టీమిండియా. అయితే, ఈ మ్యాచ్ లో పడుతూ లేస్తూ ఇండియా గెలిచిన నేపథ్యంలో మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ ( Subramaniam Badrinath) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా టీమిండియా చాలా కష్టపడి గెలిచిందని మాజీ క్రికెటర్ ఎస్ బద్రీనాథ్ ఫైర్ అయ్యారు.

ఓవర్ కాన్ఫిడెన్స్ తో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో బరిలోకి టీమిండియా దిగిందని మండిపడ్డారు. అందుకే అమెరికా మ్యాచ్ లో 77 పరుగులకే 7 వికెట్లు ఇండియా కోల్పోయిందని చురకలు అంటించారు. అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ పైన ఆధారపడడం దండగా అన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో అసలు వెళ్ళకూడదని… ఆచి చూచి ముందుకు అడుగు వేయాలని పేర్కొన్నారు. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన లేకపోతే టీమిండియా ఓడిపోయదని హెచ్చరించారు. ఆ సమయంలో టీమిండియా త్రుటిలో ఓటమిని తప్పించుకుందని బాంబు పేల్చారు. ఇలాగే ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో ఆడితే, టీమిండియా ఓట‌మి పాలు కావ‌డమే కాకుండా, టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 గ్రూప్ స్టేజ్ లోనే ఇండియా ఎలిమినేట్ అవుతుంద‌ని వార్నింగ్ ఇచ్చారు.

న‌మీబియా, పాకిస్తాన్ తో కీల‌క మ్యాచ్ లు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో భాగంగా టీమిండియా మ‌రో రెండు కీల‌క మ్యాచ్ లు ఆడ‌నుంది. ఇందులో రేపు న‌మీబియాతో మ్యాచ్ ఆడ‌నుంది టీమిండియా. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన పాకిస్తాన్‌, టీమిండియా ( India VS Pakistan) మ‌ధ్య మ్యాచ్ ఉండ‌నుంది.

Also Read: PAK VS USA: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై అనుమానాలు…USAపై పాకిస్తాన్ విజ‌యం, సూప‌ర్ 8లోకి ఎంట్రీ !

 

 

 

 

Related News

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

Big Stories

Advertisement
×