BigTV English

Bangladesh Cricket Captain: రిటైర్‌మెంట్ ప్రకటిస్తూ ఏడ్చేసిన కెప్టెన్..

Bangladesh Cricket Captain: రిటైర్‌మెంట్ ప్రకటిస్తూ ఏడ్చేసిన కెప్టెన్..

Bangladesh Cricket Captain: ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూపు అంతా ఓడీఐ వరల్డ్ కప్ కోసమే. అసలు ఈసారి వరల్డ్ కప్ ఎవరు విన్ అవుతారో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా ఈ పెద్ద టోర్నమెంట్‌కు మూడు నెలలే ఉండగా.. క్రికెట్ ఫ్యాన్స్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అంతే కాకుండా ఈసారి వరల్డ్ కప్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఎన్నో అనూహ్య పరిణామాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా అలాంటి సంఘటన మరొకటి జరిగింది.


ఓడీఐ వరల్డ్ కప్‌కు ఇంకా మూడు నెలలే సమయం ఉండగా.. బంగ్లాదేశ్ కెప్టెన్ తమిమ్ ఇక్బాల్.. రిటైర్‌మెంట్‌ను ప్రకటించాడు. ఇది బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్ద షాక్‌నే ఇచ్చింది. తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించడం కోసం ధాకాలో పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేశాడు తమిమ్. 34 ఏళ్ల ఈ ఆటగాడు గత 16 ఏళ్లుగా తన జీవితాన్ని క్రికెట్‌కే అంకితం చేశాడు. అందుకే తన రిటైర్‌మెంట్ గురించి చెప్తున్నప్పుడు ఎమోషనల్ అయ్యాడు.

‘నేను అఫ్ఘానిస్తాన్‌తో ఆడిందే నా చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్. నేను ఈ క్షణం నుండే ఇంటర్నేషన్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నాను’ అంటూ ఒక్కసారిగా అందిరికీ షాకిచ్చాడు తమిమ్. ‘ఇది నాకు అంతం లాంటిదే’ అని కన్నీటిపర్యంతమయ్యాడు. 2007లో ఓడీఐలో అడుగుపెట్టి ఇంటర్నేషనల్ క్రికెట్‌ను తన డెబ్యూను ఇచ్చాడు తమిమ్. మొదటి మ్యాచ్‌ను జింబాబ్వేతో ఆడాడు. అదంతా గుర్తుచేసుకుంటూ ‘నేను నా బెస్ట్ ఇచ్చాను. నేను నా బెస్ట్ ప్రయత్నించాను. ఈ క్షణం నుండే ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నాను’ అని చెప్పుకొచ్చాడు.


2023 అక్టోబర్ 7 నుండి బంగ్లాదేశ్ వరల్డ్ కప్ క్యాంపెయిన్ మొదలవుతుంది. మొదటి మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్‌తొ తలబడనుంది బంగ్లాదేశ్. ఒక్కసారిగా బంగ్లాదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తమిమ్ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో.. తన స్థానంలోకి వచ్చే తరువాతి క్రికెటర్ ఎవరు అని అందరిలో ఆసక్తి మొదలయ్యింది. ఇప్పటివరకు తమిమ్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 15000 పైగా రన్స్ తీశాడు. అందులో 25 సెంచరీలు కూడా ఉన్నాయి. ఓడీఐలో అత్యధిక రన్స్ చేసిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మేన్‌గా రికార్డ్ సాధించాడు. అందుకే ఇలాంటి ఒక కెప్టెన్‌ను వదులుకోవడం బాధగా ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ వాపోతున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×