James Cameron: హాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో జేమ్స్ కామెరూన్(James Cameron) ఒకరు. ఈయన దర్శకత్వ ప్రతిభ గురించి, ఈయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో అవతార్ (Avatar)ఒకటి.ఈ సినిమా ద్వారా ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించారు. అవతార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఫ్రాంచైజీస్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
వయసు పెరిగినా.. ఆరోగ్యంగా ఉన్నా..
ఇందులో భాగంగానే అవతార్: ఫైర్ అండ్ యాష్ (Avatar: Fire and Ash)డిసెంబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ మంచి అంచనాలని పెంచేశాయి. ఇక ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అవతార్ 4, 5 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించరని వస్తున్న రూమర్లపై స్పందించారు. జేమ్స్ వయసు పైబడుతున్న నేపథ్యంలోనే ఈయన ఈ సిరీస్ లకు దర్శకత్వం చేయకపోవచ్చుని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వార్తలను జేమ్స్ ఖండించారు.
మరో ఆరేడేళ్ల సమయం…
ఈ సందర్భంగా జేమ్స్ కామెరూన్ ఈ వార్తలపై స్పందిస్తూ.. తనకు వయసు పెరుగుతున్న మాట వాస్తవమేనని అయితే వయసు పెరిగిన చాలా ఆరోగ్యంగా దృఢంగా ఉన్నానని తెలిపారు. తదుపరి రాబోయే అవతార్ 4, 5 సిరీస్ లకు కూడా తానే దర్శకత్వం వహిస్తానని ఈ సందర్భంగా ఈయన స్పష్టం చేశారు. అయితే ఈ రెండు సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రావడానికి సుమారు 6 నుంచి ఏడు సంవత్సరాల సమయం పడుతుందని ఈయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. ఇక 2009వ సంవత్సరంలో అవతార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, 2022లో అవతార్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.
అంచనాలను పెంచిన ట్రైలర్..
ఇక ఈ సిరీస్ మూడో భాగం డిసెంబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇటీవల విడుదల చేసిన అవతార్ 3 ట్రైలర్ మాత్రం ఎప్పటిలాగే మంచి అంచనాలను పెంచేయడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్ లో నిలిచింది. ఈ ట్రైలర్ చూస్తుంటే పండూరా గ్రహాన్ని కాపాడటానికి జేక్ కుటుంబం యాష్ ప్రజల నాయకురాలు వరంగ్ టన్ తో పోరాటం చేస్తారని తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తేనే స్పష్టం అవుతుంది. ఇక జేమ్స్ కామెరూన్ చెప్పిన విధంగా మరో రెండు సిరీస్ లను ఈయన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే సుమారు 2030 లేదా 2031 వరకు సమయం పడుతుందని తెలుస్తుంది.
Also Read: National Awards 2025: జాతీయ అవార్డులలో సత్తా చాటిన తెలుగు సినిమాలు!