BigTV English
Advertisement

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Rohit Sharma :  సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే.. పలువురు అభిమానులతో పాటు సెలబ్రిటీలు.. పలువురు మాజీ క్రీడాకారులు, క్రీడాకారులు, రాజకీయ నాయులు, బిజినెస్ మేన్స్ ఇలా పలు విభాగాలకు చెందిన వారు అందరూ హాజరవుతుంటారు. వారంతా హాజరై మ్యాచ్ ని వీక్షిస్తారు. తాజాగా భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ చూసేందుకు భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఓవల్ స్టేడియానికి వచ్చాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు రోహిత్.. మూడో రోజు ఆటను వీక్షించేందుకు స్టేడియంలో కనిపించాడు. ఆ సందర్భంగా అతను ధరించిన దుస్తులు, చేతికి ఉన్న వాచ్ అందరి దృష్టి ని ఆకర్షించాయి.  దీంతో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ధర గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు.


Also Read : IND Vs ENG 5th Test : సిరాజ్ బిగ్ మిస్టేక్.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

రోహిత్ శర్మ వాచ్ అన్ని కోట్లా..? 


ఓవల్ టెస్ట్ మూడో రోజు ఆటలో రోహిత్ శర్మ బ్లాక్ డెనిమ్ షాకెట్ మరియు జీన్స్‌లో చాలా సాధారణంగా కనిపించాడు. అయితే, అతని చేతికి ఉన్న ఆడెమర్స్ పిగెట్ రాయల్ ఓక్ జంబో ఎక్స్‌ట్రా-థిన్ స్మోక్డ్ బర్గుండీ టైటానియం వాచ్ చాలా స్పెషల్. ఈ వాచ్ ధర దాదాపు రూ.2.46 కోట్లు ఉంటుందని అంచనా. మ్యాచ్ చూసేందుకు వచ్చిన రోహిత్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడో రోజు ఆటలో అద్భుతమైన సెంచరీతో మెరిసిన యువ సంచలనం యశస్వి జైస్వాల్, ఆట తర్వాత రోహిత్ శర్మ గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. పోస్ట్-మ్యాచ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో జైస్వాల్ మాట్లాడుతూ.. “నేను రోహిత్ భాయ్‌ను చూసి హాయ్ చెప్పాను. అతను నన్ను చూసి నువ్వు బ్యాటింగ్ చేస్తూ ఉండు అని మాత్రమే చెప్పారు” అని తెలిపాడు.

జైస్వాల్ సెంచరీ.. 

సెంచరీ గురించి మాట్లాడుతూ.. “పిచ్ కొంచెం స్పైసీగా ఉంది. కానీ నేను బ్యాటింగ్ ఎంజాయ్ చేశాను. ఇంగ్లండ్‌లో ఇలాంటి పిచ్‌లపై ఆడతామని నాకు తెలుసు. నేను మానసికంగా సిద్ధమయ్యాను. ఏ షాట్లు ఆడాలనేది నాకు తెలుసు” అని చెప్పాడు.  యశస్వి జైస్వాల్ మూడో రోజు ఆటను నైట్‌వాచ్‌మెన్ ఆకాశ్ దీప్‌తో కలిసి ప్రారంభించాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 150 బంతుల్లో 107 పరుగులు జోడించి ఇంగ్లండ్ బౌలర్లను ఇబ్బందిపెట్టారు. ఆ తర్వాత కరుణ్ నాయర్ (40 పరుగులు), రవీంద్ర జడేజా (44 పరుగులు)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్ ఆధిక్యాన్ని పెంచాడు. జైస్వాల్ కేవలం 164 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 118 పరుగులు చేసి తన ఆరో టెస్ట్ సెంచరీని సాధించాడు. జైస్వాల్ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 23 పరుగుల లీడ్ లో ఉండటంతో..  ఇంగ్లండ్‌కు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. ఇంగ్లాండ్ బ్యాటర్లు 374 పరుగులను ఛేదించేందుకు చాలా దగ్గర్లోనే ఉన్నారు.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×